Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్.. డాక్టర్ అనహిత పండోల్‌పై ఎఫ్ఐఆర్

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలను బలిగొన్న రోడ్డు ప్రమాదం ఘటనలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోలేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన రోజున సైరస్ ప్రయాణించిన కారును ఆమె డ్రైవ్ చేశారు. 

police filed FIR against Dr Anahita Pandole in Cyrus Mistry car accident case
Author
First Published Nov 5, 2022, 9:48 PM IST

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలను బలిగొన్న రోడ్డు ప్రమాదం ఘటనకు సంబంధించి కీలక మలుపు తిరిగింది. ఆయన స్నేహితురాలు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోలేపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలావుండగా... సెప్టెంబర్ 4న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సైరస్ మిస్త్రీ విలాసవంతమైన కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఇందులో కారు వెనుక సీటులో కూర్చున్న మిస్త్రీ (54), జహంగీర్ పండోలే మృతి చెందారు. ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోల్ (55) కారు నడుపుతుండగా, ఆమె భర్త డారియస్ పండోల్ (60) ముందు సీట్లో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా వీరి కారు రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తేల్చారు. ప్రమాద సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తోంది. 

Also REad:సైరస్ మిస్త్రీ మృతి.. పోస్టుమార్టమ్ నివేదిక ఏం చెబుతుందంటే..?

కాగా.. టాటా సన్స్‌కి సైరస్ మిస్త్రీ ఆరో చైర్మన్. 2012లో రతన్ టాటా తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే, మిస్త్రీని 24 అక్టోబర్ 2016న టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. తదనంతరం, ఫిబ్రవరి 6, 2017న, అతను హోల్డింగ్ కంపెనీ బోర్డు నుండి డైరెక్టర్‌గా కూడా తొలగించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సైరస్ మిస్త్రీ ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజీ కుమారుడు. పల్లోంజీ కంపెనీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ టాటా గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 

టాటా సన్స్ ఛైర్మన్ కాకముందు, సైరస్ మిస్త్రీ తన కుటుంబ నిర్మాణ వ్యాపారాన్ని నిర్వహించేవారు. సైరస్ లండన్‌లోని ప్రతిష్టాత్మక ఇంపీరియల్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో టాటా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, టాటా మోటార్స్‌లో వ్యాపారానికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకున్నారు. అతని కష్టానికి ఫలితం దక్కింది. తరువాత అతను ఫోర్బ్స్ గోకాక్, యునైటెడ్ మోటార్స్ (ఇండియా), షాపూర్జీ పల్లోంజీ అండ్ కో వంటి అనేక ఇతర కంపెనీలకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios