సారాంశం

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ తండ్రి తన కుమారుడి కోసం గాలిస్తున్నాడు. ఉదయం నుంచి తన కొడుకు కనిపిస్తున్నాడేమో అని వెతుకుతున్నానని, అయినా కనిపించడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. 

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ దుర్ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రయాణికులు మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నా.. 1000 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన చోటు చేసుకున్న ప్రాంతం నుంచి రెస్య్కూ సిబ్బంది అనేక మంది క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా స్థానికంగా భద్రపరిచారు. 

అమెరికాలో నిజామాబాద్ యువకుడు మృతి.. ఎలాగంటే ?

కాగా.. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న అనేక మంది ఘటనా స్థలానికి తరలివచ్చారు. తమ ఆత్మీయుల కోసం వెతికారు. చనిపోయిన వారిలో తమ వారు ఉన్నారేమో అని ఆందోళన పడుతూ మృతదేహాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమారుడి కోసం వెతుకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన చెబుతున్న మాటలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.

Scroll to load tweet…

ప్రమాదానికి గురైన రైళ్లలో భద్రక్ జిల్లా సుగొ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రయాణించాడు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న వెంటే ఓ వృద్ధ తండ్రి వెంటనే బాలేశ్వర్ ప్రాంతానికి చెరుకున్నాడు. తన కుమారుడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాడు. అయినా అతడి జాడ కనిపించలేదు. దీంతో పొంగుతున్న దు:ఖాన్ని దిగమింగుకుంటూ మృతదేహాలను కూడా పరిశీలించడం మొదలుపెట్టాడు. చనిపోయిన వారిలో తన బిడ్డ ఉన్నాడేమో అని అనుకుంటూ.. ఒక్క మృతదేహం ముసుగుచూస్తూ ఉండిపోయాడు.

Ved Prakash: మాజీ మేజర్‌ వేద్‌ ప్రకాశ్‌ కన్నుమూత.. పలువురు కాంగ్రెస్ నాయకుల సంతాపం

దీనిని ఒకరు వీడియో తీశారు. మృతదేహాలన్నీ పరిశీలిస్తూ అందులో తన కుమారుడు లేడని బయటకు వచ్చాడు. ఆ సమయంలో వీడియో తీసిన వ్యక్తి ఆ వృద్ధ తండ్రిని ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో ఆయన తన కుమారుడి విషయం, తాను ఎక్కడి నుంచి వచ్చాననే విషయం వెల్లడించాడు. ఉదయం నుంచి తన కుమారుడి కోసం వెతుకుతున్నానని, అయినా ఇప్పటి వరకు కనిపించలేదని ఆయన దు:ఖంతో చెప్పాడు. అతడితో మాట్లాడుతూనే ఒక్కసారిగా ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.