Asianet News TeluguAsianet News Telugu

హార్న్‌బిల్ ఫెస్టివల్ రద్దు.. AFSPAను రద్దు చేయాలంటూ డిమాండ్

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ తో పాటు ఈశాన్య భారతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేడుకలను విరమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.  అలాగే, ఈశాన్య భారతంలో భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న చట్టం AFSPA ను  ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలపడుతోంది. 
 

Nagaland calls off Hornbill Festival over civilian killings
Author
Hyderabad, First Published Dec 7, 2021, 4:59 PM IST

ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు మరింత దారుణంగా మారకుండా మోన్ జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే, టెలికాం సేవలపై ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సైతం నిలిపివేశారు. అయినప్పటికీ ప్రజలు తమ నిరసన గొంతుకను వినిపిస్తున్నారు. మోన్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ.. ప్లకార్డులను ఉంచారు. ‘‘వుయ్ వాంట్ జస్టిస్’’, ‘ఏఏఫ్ఎస్ ఫీఏను రద్దు చేయాలి’ అంటూ రాసిన్న ప్లకార్డులు రాష్ట్ర వ్యాప్తంగా వెలిశాయి. 

Also Read: భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భ‌ర‌ద్వాజ్‌కు ఊర‌ట‌

ప్రస్తుతం రాష్ట్రంలో హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పర్యటకంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, భద్రతా బలగాలు సామన్య పౌరులను కాల్చి చంపడాన్ని నిరశిస్తూ.. ఇప్పటికే అక్కడి ప్రజలు హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేడుకలను బహిష్కరించారు. మోన్ జిల్లాలోని హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేదికలపై నల్ల జెండాలను ఉంచుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం సైతం హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేడుకల విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. హార్న్‌బిల్ ఫెస్టివల్‌ వేడుకలు ఈ నెల 10న ముగియాల్సి ఉన్నవి. అయితే, భద్రతా బలగాలు 14 మంది పౌరులను చంపినందుకు కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను విరమించుకోవాలని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ​​మంత్రివర్గం మంగళవారం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.  అలాగే, సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం AFSPA  (ఏఎఫ్ఎస్ పీఏ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

Also Read: 47 దేశాల‌కు వ్యాపించిన ఒమిక్రాన్..

రాష్ట్ర రాజధానికి సమీపంలోని కిసామాలోని నాగా హెరిటేజ్ విలేజ్‌లో జరుగుతున్న 10 రోజుల హార్న్‌బిల్ ఫెస్టివల్, రాష్ట్ర అతిపెద్ద పర్యాటక మహోత్సవం. ఈ వేడుకలు  డిసెంబర్ 10న ముగియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సోమవారం వేదిక వద్ద జరగాల్సిన కార్యక్రమాన్ని సైతం  రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.  ఇదిలావుండగా, ఈశాన్య భారతంలో భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్  (ఏఎఫ్ఎస్ పీఏ)ను రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. చాలా కాలం నుంచి ఏఎఫ్ఎస్ పీఏ రద్దు చేయాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన మోన్ జిల్లా ఘటన నేపథ్యంలో మళ్లీ ఈ చట్టం తెరమీదకు వచ్చింది.  మోన్ ఘటనలో చనిపోయిన పౌరుల అంతక్రియలకు హాజరైన రాష్ట్ర సీఎం నిఫియూ రియో.. ఏఎఫ్ఎస్ పీఏ రద్దు చేయాలన్నారు. ఈ చట్టం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రానికి ఈ విషయంపై లేఖ రాయడానికి సిద్ధమైంది. అలాగే, మేఘాలయ సీఎం సంగ్మా సైతం ఏఎఫ్ఎస్ పీఏ ను రద్దు చేయాలని ట్వీట్ చేశారు. 

Also Read: వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు 

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios