Asianet News TeluguAsianet News Telugu

47 దేశాల‌కు వ్యాపించిన ఒమిక్రాన్..

ద‌క్షిణాఫ్రికాల‌లో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న‌ది.  గ‌త నెల గుర్తించ‌బ‌డిన ఈ వేరియంట్ ప్ర‌స్తుతం 47కు పైగా దేశాల‌కు విస్త‌రించింది. ద‌క్షిణాఫ్రికాలో కోవిడ్‌-19 కొత్తవేవ్‌కు కార‌ణ‌మైంది. 
 

omicron variant spread 47 countries
Author
Hyderabad, First Published Dec 7, 2021, 2:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. వైర‌స్ క‌ట్ట‌డికి టీకాలు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. క‌రోనా తనలో మార్పులు చేసుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక మ్యుటేష‌న్ల‌కు లోనైన క‌రోనా వైర‌స్‌.. ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా రూపాంత‌రం చెందింది. ఈ నేప‌థ్యంలోనే  గ‌త నెల ద‌క్షిణాఫ్రికాలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా భావిస్తున్న డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్ల క‌న్నా.. ప్ర‌స్తుత ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్ర‌మాక‌ర‌మైన‌దిగా నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ల జాబితాలో గ‌త నెల‌లోనే చేర్చింది.  ప్ర‌స్తుతం అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతున్న‌ది.  నవంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల‌కు వ్యాపించింది.  అయితే, దీని బారిన‌ప‌డి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చ‌నిపోలేద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు

ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, ప్రాథ‌మిక విశ్లేష‌ణ‌లో వెలుగుచేసిన వివ‌రాల ప్ర‌కారం.. దీనిలో అధికంగా స్పైక్ మ్యుటేష‌న్లు ఉన్నాయి. దీని కార‌ణంగా ఇది డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణుల అంచ‌నాలు పేర్కొంటున్నాయి.  దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్  మొద‌ట వెలుగుచూసిన  దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కేసులు భారీగా న‌మోద‌వుత‌న్నాయి. వారం రోజుల్లోనే దాదాపు 700 శాతం కొత్త కేసులు న‌మోదులో పెరుగుద‌ల న‌మోదైంది. దీంతో ఆ దేశంలో నాల్గోవేవ్ ప్రారంభంలో ఉంద‌ని అక్క‌డి వైద్య నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గతవారం 2,300 క‌రోనా కేసులు న‌మోదుకాగా, ప్ర‌స్తుతం 16 వేల‌కు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో దాదాపు 70 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.  దీనికి తోడు క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసుతో పాటు రెండు డోసులు తీసుకున్న‌వారికి సైతం ఈ వేరియంట్ బారిన‌ప‌డుతుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

Also Read: మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్ప‌టివ‌ర‌కు  దక్షిణాఫ్రికా, సెనెగల్, బోట్స్‌వానా, మెక్సికో, భారత్‌, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్ దేశాల్లో న‌మోద‌య్యాయి. ఒమిక్ర‌న్ వేరియంట్ యొక్క స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు అధికంగా ఉన్నాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. దీని కార‌ణంగా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అలాగే, ప్ర‌స్తుతం ఉన్న టీకాలను సైతం ఒమిక్రాన్ ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌లిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. మ‌రికొంత మంది ప‌రిశోధ‌కులు ఒమిక్రాన్‌పై టీకాల ప్ర‌భావం గురించి రీసెర్చ్ చేస్తున్నారు. 

Also Read: రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు

Follow Us:
Download App:
  • android
  • ios