Asianet News TeluguAsianet News Telugu

Mukesh Ambani: వారసుల చేతుల్లోకి రిలయన్స్‌.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్య‌లు !

Mukesh Ambani: ఆసియా అప‌ర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ నాయకత్వ మార్పుపై కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ నుంచి రిటైల్ వరకూ విస్తరించిన వ్యాపార శ్రేణిని సీనియర్లతో కలిసి ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త తరానికి ఆ ఫలితాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఆయ‌న‌.. త‌న ముగ్గురు సంతానానికి రిల‌య‌న్స్ ను త్వరలోేనే అప్ప‌గించే విధంగా సూచ‌న‌ప్రాయ వ్యాఖ్య‌లు చేశారు. 

Mukesh Ambani talks of leadership transition at Reliance; wants to accelerate the process
Author
Hyderabad, First Published Dec 29, 2021, 1:10 AM IST

Mukesh Ambani: ఆసియా అప‌ర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ నాయకత్వ మార్పుపై కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ నుంచి రిటైల్ వరకూ విస్తరించిన వ్యాపార శ్రేణిని సీనియర్లతో కలిసి ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త తరానికి ఆ ఫలితాలను అందించడమే లక్ష్యమని పేర్కొన్న ఆయ‌న‌.. త‌న ముగ్గురు సంతానానికి రిల‌య‌న్స్ అప్ప‌గించే విధంగా సూచ‌న‌ప్రాయ వ్యాఖ్య‌లు చేశారు. రిల‌య‌న్స్ సంస్థ యాజ‌మాన్య బాధ్య‌త‌ల‌ను త‌న వార‌సుల‌కు అప్ప‌గించ‌నున్నారు. మంగ‌ళ‌వారం రిల‌య‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ధీరూభాయి అంబానీ జ‌యంతి.. రిల‌య‌న్స్ ఫ్యామిలీ డే సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముకేశ్ అంబానీ.. రిల‌య‌న్స్ నాయ‌క‌త్వ మార్పుపై వ్యాఖ్య‌లు చేశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు త‌న వార‌సుల‌కు.. యువ‌త‌రానికి సంస్థ యాజ‌మాన్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే విష‌య‌మై ముకేశ్ అంబానీ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ మంగ‌ళ‌వారం నాడు నిర్వ‌హించిన రిల‌య‌న్స్ ఫ్యామిలీ డేలో దీని గురించి ప్ర‌స్తావించారు. కాగా,  ముకేశ్ అంబానీకి కూతురు ఈషాతోపాటు కొడుకులు ఆకాశ్‌, అనంత్ లు ఉన్నారు.

Also Read: Assembly Election 2022: ఒమిక్రాన్ సాకుతో ఎన్నిక‌ల వాయిదాకు బీజేపీ కుట్ర.. ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం !

రిల‌య‌న్స్ ఫ్యామిలీ డే కార్య‌క్ర‌మంలో అంబానీ భవిష్యత్తు భాధ్యతల గురించి తొలిసారిగా ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్ సంస్థలో “అత్యంత ప్రభావవంతమైన నాయకత్వ మార్పు”కు శ్రీకారం పడనున్నట్లు సూచించారు. అలాగే, త‌న‌తో స‌హా సంస్థ సీనియ‌ర్లంతా యువ‌త‌రానికి బాధ్య‌త‌లు అప్ప‌గించే ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న‌ పేర్కొన్న‌ట్లు  పీటీఐ నివేదించింది. పెట్రోలియం రంగం మొద‌లు రిటైల్.. టెలికం.. డిజిట‌ల్‌.. ఈ-కామ‌ర్స్ త‌దిత‌ర రంగాల్లో పేరొందిన భార‌త అంత‌ర్జాతీయ కంపెనీల్లో రిల‌య‌న్స్ ఒక‌టి. రిలయన్స్ గ్రూప్ నిర్మాత అయినటువంటి ధీరూబాయి అంబానీ జయంతిని పురస్కరించుకొని రిలయన్స్ గ్రూప్ ప్రాశస్త్యాన్నిముఖేష్ అంబానీ  గుర్తుచేశారు. అతి త్వరలోనే రిలయన్స్ గ్రూప్ , దేశీయంగా ఎదిగి వచ్చిన బహుళ జాతీయ కంపెనీగా ప్రపంచంపై ముద్ర వేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భ‌విష్య‌త్‌లో క్లీన్ అండ్ గ్రీన్ ఎన‌ర్జీ రంగాల‌తోపాటు రిటైల్‌, టెలికం రంగాల్లో బిజినెస్‌ను మ‌రింత ఉన్నత శిఖ‌రాల‌కు తీసుకెళ్లాల‌ని ముకేశ్ అంబానీ భావిస్తున్నారు.

Also Read: Assembly Election 2022:ఎన్నిక‌లే ల‌క్ష్యం.. ఈ నెల 30న ఉత్త‌రాఖండ్ లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌

భారీ స్న‌ప్నాల సాకారంతోపాటు అసాధ్యం కానీ ల‌క్ష్యాల దిశ‌గా గొప్ప కలలను సాకారం చేసుకునేందుకు, లక్ష్యంపై చూపుతో ముందుకు వెళ్లేందుకు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వం అవసరముంద‌న్నారు. అలాగే,  రిలయన్స్ ప్రస్తుతం ఒక కీలక దశలో మార్పు దిశగా అడుగులు వేస్తోంద‌ని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. త‌న  తరానికి సంబంధించిన సీనియర్లతో పాటు, తర్వాతి తరం యువలీడర్ల వైపు ఈ మార్పు సాగుతుందని సూచించారు.ఈ ప్ర‌క్రియ వేగ‌వంతం కావాల‌ని అని ఆయ‌న అన్నారు. రిలయన్స్ సంస్థను నూతన స్థాయికి తీసుకెళ్లడంలో తర్వాతి తరం ప్రతినిధులు అయిన ఆకాశ్, ఈశా, అనంత్ శాయశక్తులా కృషి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేద‌ని పేర్కొన్న ముఖేష్ అంబానీ..  వారిలో ఒక చురుకుతో పాటు సామర్థ్యం కనిపించిందన్నారు. అంబానీ తన ప్రసంగంలో ఇషా (ఆనంద్‌ పిరమల్‌), అకాశ్‌ (శ్లోక) జీవిత భాగస్వాముల పేర్లతో పాటు అనంత్‌కు జీవిత భాగస్వామి కాబోతున్న రాధిక పేరును ప్రస్తావించారు.

Also Read: coronavirus: ఒమిక్రాన్‌ ఇమ్యూనిటీతో డెల్టాకు చెక్‌.. కొత్త అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు !

Follow Us:
Download App:
  • android
  • ios