పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ ఆకస్మిక మరణం పట్ల ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ ఈ రోజు చాలా దుర్దినమని.. నా సోదరుడు, స్నేహితుడు, మార్గదర్శి అనంతకుమార్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది..

ఆయన నా కుటుంబంలో ఒకడు.. నాకున్న అతికొద్ది మంది నిజమైన మిత్రుల్లో అనంతకుమార్ ఒకరు. విలువలో కూడిన రాజకీయాలు చేసిన మానవత్వం నిండిన మంచి మనిషి.. ఆయన మరణం నాకు తీరని లోటంటూ’’ రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంతకుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
 

కేంద్ర మంత్రి అనంతకుమార్ కన్నుమూత

సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

కేరళ రాష్ట్రానికి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ రూ.25లక్షల విరాళం

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం