మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. మచ్చు నదిలో ముగిసిన సెర్చ్, రెస్య్యూ ఆపరేషన్..
గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో ఉన్న మచ్చు నదిలో చేపడుతున్న సెర్చ్, రెస్య్యూ ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఇంకా తప్పిపోయిన వారెవరి సమాచారం లేదని చెప్పారు.
గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదం నింపింది దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న ఐదు రోజుల తరువాత మచ్చు నదిలో చేపడుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ గురువారం అర్ధరాత్రి ముగిసింది. దాదాపు తప్పిపోయిన అందరి ఆచూకీ లభ్యమైందని కాబట్టి రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు స్టేట్ రిలీఫ్ కమిషనర్ హర్షద్ పటేల్ తెలిపారు. అన్ని దర్యాప్తు సంస్థలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.
ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి అజిత్ మోహన్ రాజీనామా.. స్నాప్ చాట్ లో చేరిక
వడోదరకు 300 కి.మీ దూరంలో ఉన్న మోర్బీ సిటీలో ఉన్న బ్రిటీష్ కాలం నాటి వంతెనపై గత ఆదివారం సందర్శకులు నిలబడి ఉన్న సమయంలో ఒక్క సారిగా అది కూలిపోయింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో దానిపై నిలిబడి ఉన్న వారందరూ నదిలో పడిపోయారు. వేగంగా వెళ్లి నీటిలో పడిపోవడంతో అడుగు భాగంలో ఉన్న రాళ్లను తాకి, ఊపిరాడక దాదాపు 135 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయాలు అయ్యాయి.
దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన జరిగిన సమయంలో చాలా మంది విరిగిన వంతెన భాగాలను పట్టుకొని వేళాడుతూ కనిపించారు. అలాగే మరి కొందరు నదిలో ఈత కొడుతూ సురక్షితంగా బయటపడటం కూడా కనిపించింది. ఈ ఘటన సమాచారం అందింన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, లోకల్ అడ్మినిస్ట్రేటివ్, ఇతర ఏజెన్సీలు అక్కడికి చేరుకున్నాయి. మోర్బి వంతెన కూలిన ప్రదేశంలో సెర్చ్ అండ్ రెస్య్యూ ఆపరేషన్ చేపట్టింది.
కాగా.. మోర్బీలో పరిస్థితిని సమీక్షించేందుకు గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. మంగళవారం గుజరాత్ లోని మోర్బీలో పర్యటించారు. అలాగే బాధితులు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దుర్ఘటనలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను కోరింది.
ఈ ఘటనలో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వంతెన కూలిన దుర్ఘటనకు కారణమైన ఒరేవా గ్రూపులోని తొమ్మిది మంది వ్యక్తులపై గుజరాత్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 304, 308 కింద ఎఫ్ఐర్ ను నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురిలో ఇద్దరు ఓరేవా కంపెనీ నిర్వాహకులు. వారు ఏడు నెలల బ్రిడ్జి మరమ్మతు పనుల తర్వాత సందర్శకుల కోసం వంతెనను తెరిచిన వ్యక్తులు. మిగిలిన ఇద్దరు ఫ్యాబ్రికేషన్ వర్క్ కాంట్రాక్టర్లకు చెందిన వారు.
ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పేటెంట్ రైట్స్ నమోదు
ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న మోర్బీ ఎస్పీ రాహుల్ త్రిపాఠి మాట్లాడుతూ.. తాము కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. వంతెన పునరుద్ధరణలో లోపాలకు కారణమైన బాధ్యులు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, ఇంకా ఈ ఘటనలో ఎవరి పాత్ర అయినా ఉంటే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని తెలిపారు.