ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి అజిత్ మోహన్ రాజీనామా.. స్నాప్ చాట్ లో చేరిక

మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఫేస్ బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన ఫిబ్రవరిలో స్నాప్ చాట్ లో చేరనున్నారు. 

Facebook India head Ajit Mohan resigns.. joins Snap Chat

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇండియా హెడ్ పదవికి అజిత్ మోహన్ రాజీనామా చేశారు. అనంతరం ఓ కీలక ప్రకటన చేశారు. ఫేస్ బుక్ ప్రత్యర్థి కంపెనీ అయిన స్నాప్ చాట్ లో చేరబోతున్నట్టు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అధికారికంగా అందులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పరిణామంపై మెటా లోని గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ మాట్లాడుతూ.. అజిత్ కొత్త అవకాశాల కోసం మెటాలోని తన బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. 

ఎల్వోసీ ద్వారా ఉగ్రవాదుల అక్రమ చొరబాటు భగ్నం.. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ముగ్గురిని మట్టుబెట్టిన సైన్యం..

‘‘ గత నాలుగు సంవత్సరాలుగా అజిత్ మోహన్ ఫేస్ బుక్ ఇండియా కార్యకలాపాలను రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీని వల్ల అనేక మిలియన్ల భారతీయ వ్యాపారాలు, భాగస్వాములు ప్రజలకు సేవలందించగలిగాం. మేము భారతదేశం పట్ల ప్రగాఢమైన నిబద్ధతతో ఉన్నాము. మా పని భాగస్వామ్యాలను కొనసాగించడానికి బలమైన నాయకత్వ బృందాన్ని కలిగి ఉన్నాము. అజిత్ నాయకత్వానికి, సహకారానికి కృతజ్ఞత చెబుతున్నాం. భవిష్యత్తు కోసం అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ’’ అని మెండెల్సోన్ ఓ లేఖలో పేర్కొన్నారు.

టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.

అజిత్ మోహన్ జనవరి 2019లో ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరారు. ఆయన తన పదవీ కాలంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులను పొందాయి. ఆయన మెటాలో చేరడానికి ముందు స్టార్ ఇండియా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన హాట్ స్టార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నాలుగు సంవత్సరాల పాటు పనిచేశారు. హాట్‌స్టార్ అనే స్ట్రీమింగ్ సర్వీస్‌ను డెవలప్ చేయడానికి ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం అయిన స్టార్ ఇండియాను ఒప్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 

కాగా.. అజిత్ మోహన్ స్నాప్ చాట్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడిగా ఫిబ్రవరిలో కంపెనీలో చేరనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. స్నాప్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. “ అజిత్ మోహన్ మా స్నాప్ చాట్ ఏపీఏసీ కొత్త ప్రెసిడెంట్ గా ఫిబ్రవరిలో చేరబోతున్నారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. స్నాప్ ఎగ్జిక్యూటివ్ టీమ్‌లో అజిత్ మోహన్ సభ్యుడిగా ఉంటారు. ఆయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెర్రీ హంటర్‌కు రిపోర్ట్ చేస్తారు. భారతదేశం, చైనాతో పాటు ప్రాంతీయ విక్రయాల బృందం అజిత్ మోహన్‌కు రిపోర్ట్ చేస్తుంది.’’ అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపించిన మహిళ.. పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేత 

కాగా..  అనేక ఫీచర్లను పరిచయం చేసే లక్ష్యంతో స్నాప్ ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. డేటా ఏఐ, సెన్సార్ టవర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. యాప్ గత మూడేళ్లలో దేశంలో స్నాప్ చాట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios