ఎల్వోసీ ద్వారా ఉగ్రవాదుల అక్రమ చొరబాటు భగ్నం.. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ముగ్గురిని మట్టుబెట్టిన సైన్యం..
జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ ద్వారా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అందులో ఒకరి మృతదేహాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్వీసీ)పై దిగ్వార్ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. వారిలో ఒకరి మృతదేహాన్ని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పడి ఉన్న మరో ఇద్దరి మృతదేహాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) గ్రామస్థులు వెనక్కి తీసుకున్నారు.
టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.
రక్షణ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గురువారం కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఇండియన్ ఆర్మీ సైనికులు గమనించారు. వారు నియంత్రణ రేఖ దాటి చొరబాటుకు యత్నించారు. అప్రమత్తమైన సైనికులు వారిని హెచ్చరించి లొంగిపోవాలని కోరారు.
కానీ వారు సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో సైనికులు కూడా ప్రతీకార చర్యకు పూనుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు చొరబాటుదారులు హతమయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. అతడి వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక పిస్టల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పీఓకేలోని గ్రామస్థులు మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను వెనక్కి తీసుకెళ్లారని అధికారులు తెలిపారు.
ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పేటెంట్ రైట్స్ నమోదు
కాగా.. అంతకు ముందు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో అక్రమ చొరబాటు ప్రయత్నాన్ని కూడా భద్రత బలగాలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల ద్వారా వచ్చిన నిర్ధిష్ట సమాచారం మేరకు ఆ జిల్లాలోని జుమాగుండ్ సాధారణ ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం, తక్కువ దృశ్యమానతను ఆసరాగా చేసుకొని గత సోమవారం ఉదయం 10.25 గంటల ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ప్రయత్నాలు జరిగాయి.
అప్రమత్తమైన జవాన్లు తీవ్రవాదిపై గట్టి నిఘా ఉంచారు. అతడు భద్రతా బలగాల దగ్గరకు రాగానే ఎదురు తిరిగాడు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఉగ్రవాది బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో సైన్యం కూడా కాల్పులు జరిపింది. దీంతో అతడు మరణించాడు. ఆ ప్రాంతంలో జరిపిన అన్వేషణలో ఎకే సిరీస్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ ఎన్నికల్లో ఆప్ దే విజయం.. ఓటువేస్తే ఆయోధ్యకు తీసుకెళ్తాం: అరవింద్ కేజ్రీవాల్
పది రోజుల్లో మూడో చొరబాటు యత్నం
జమ్మూ కాశ్మీర్ లో పది రోజుల్లో మూడు సార్లు చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. గడిచిన వారం రోజుల్లో కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ నుంచి రెండు చొరబాటు యత్నాలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు కూడా అక్టోబర్ 26న కుప్వారా జిల్లాలోని కర్నా సెక్టార్‌లోని సుధ్‌పురా ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఈ సమయంలో కూడా ఓ పాకిస్థానీ ఉగ్రవాది హతం అయ్యాడు. అతడి సహచరుడు మరొకరు తిరిగి తప్పించుకోగలిగాడు. ఇప్పుడు పూంచ్ నియంత్రణ రేఖ నుంచి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు.