కోతులు, కుక్కల మధ్య గ్యాంగ్ వార్.. పిల్ల కోతిని కుక్క చంపడంతో ప్రతీకారం.. 250 కుక్కలను చంపిన వానరులు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి. పిల్ల కోతిని ఓ కుక్క చంపేసిన తర్వాత అవి మూకుమ్మడిగా ఒక్కో కుక్కను వేటాడి చంపేయడం ప్రారంభించాయి. ఒక్కో కుక్కను చెట్లపై నుంచి లేదా భవనాల పై నుంచి కిందకు విసిరేసి చంపేశాయి. ఇది కచ్చితంగా వానరుల ప్రతీకారమే అని కొందరు స్థానికులు అభిప్రాయపడ్డారు.
 

monkeys killed over 250 dogs to take revenge

ముంబయి: యుద్ధాలు, గ్యాంగ్ వార్‌లు కేవలం మానవ జాతిలోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటాయని ఈ వానరులు వెల్లడి చేశాయి. ఓ చిన్న కోతి పిల్లను ఓ కుక్క చంపేసిన ఘటనకు ప్రతీకారంగా(Revenge) కోతులన్నీ(Monkeys) ఏకం అయ్యాయి. పథకం ప్రకారం.. ఒక్కో కుక్క(Dog)ను ఏరేశాయి. గడిచిన నెల రోజుల్లో సుమారు 250 కుక్కలను చంపేశాయి(KIlled). చంపాలనుకున్న కుక్కను వేటాడటం.. దాన్ని చెట్టుపైకి లేదా భవంతిపైకి మోసుకెళ్లి.. అక్కడి నుంచి కిందకు విసిరేసే పద్ధతిని అవి అవంలభించాయి. ఇప్పుడు ఆ ఊరిలో చూడటానికి కుక్కలు కనిపించడమే లేవు. ఈ ఘటన Maharashtraలోని భీడ్‌లో చోటుచేసుకుంది.

ఈ కోతులు, కుక్కలకు మధ్య శత్రుత్వంలో మజల్‌గావ్‌లో చోటుచేసుకున్న ఘటనతో ప్రారంభం అయ్యాయి. ఆ ఊరిలో ఓ కుక్క.. పిల్ల కోతిని చంపేసింది. ఈ ఘటన తర్వాతే కోతులు.. కుక్కల మీద దాడి చేయడం మొదలు పెట్టాయి. గత మూడు నెలలుగా కోతులు.. కుక్కలను ఎత్తుకెళ్లి చెట్లపై నుంచి, భవనాల పై నుంచి కిందకు విసిరేస్తున్నాయి. ఓ స్థానికుడు పెంచుకుంటున్న కుక్క పిల్ల పప్పీని కోతులు లాక్కెళ్లాయి. కోతుల బారి నుంచి తన కుక్కను కాపాడుకోవడానికి ఆ స్థానికుడు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఆ కోతుల ‘ముఠా’ నుంచి తన కుక్కను కాపాడుకోగలిగాడు.. కానీ, ఈ క్రమంలో ఆయన కాలు విరిగింది.

Also Read: నన్నే తరుముతావా? నీ అంతు చూస్తా..! అతనిపై రివేంజ్ తీసుకున్న కోతి.. 22 కిమీలు ప్రయాణించి మరీ..

వీటి మధ్య వైరాన్ని ఆపేయడానికి స్థానికులు కొందరు ప్రయత్నించారు. కానీ, విఫలం అయ్యారు. దీంతో అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొలుత వారు కూడా విఫలం అయ్యారు. కోతులను కట్టడి చేయడంలో సఫలం కాలేదు. ఈ ప్రయత్నం తర్వాత కోతులు మరింత దూకుడు ప్రదర్శించాయి. స్కూళ్లకు వెళ్తున్న చిన్న పిల్లలపైనా దాడి చేయడానికి ప్రయత్నాలు చేశాయి. ఓ ఎనిమిదేళ్ల పిల్లాడిని స్కూల్‌కు వెళ్తుండగా కోతులు అటకాయించాయి. కొంత దూరం లాక్కెళ్లాయి. అక్కడే ఉన్న వ్యక్తులు రాళ్లతో ఆ కోతులను బెదిరించాల్సి వచ్చింది. అప్పుడు కోతులు ఆ పిల్లాడిని వదిలిపెట్టాయి.

కానీ, అప్పటి నుంచి స్థానికుల్లో కలవరం పెరిగింది. ఎలాగైనా.. ఈ బెడదకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిశ్చయించుకున్నారు. మరోసారి వారు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సారి ఆ అటవీ అధికారులు.. స్థానికులు, పోలీసుల సహకారం తీసుకున్నారు. మజల్‌గావ్ ఊరిని భయాందోళనలకు గురి చేసిన కొన్ని కోతులను వారు ఎట్టకేలకు పట్టుకోగలిగారు.

Also Read: క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్

ఇటీవలే కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ కోతి తనను తరిమిన వ్యక్తిని స్పష్టంగా గుర్తుపెట్టుకుని దాడి చేసింది. ఇంటా, బయటా ఎక్కడికెళ్లినా ఆయనను వెంటాడింది. ఆయన నడిపే ఆటోపై ఉండే కవర్‌ను చింపేసింది. ఆయనపై పడి రక్కింది. కన్ను మూసినా తెరిచినా కోతి పీడకలలా వెంటాడింది. ఎట్టకేలకు అధికారులు ఆ కోతిని కనీసం 22 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టి వచ్చారు. కానీ, ఆ కోతి తన పగను మరువలేదు. అంత దూరం ప్రయాణించి మరీ ఆ వ్యక్తి ఉన్న ప్రాంతానికి వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios