క్రైం కపుల్స్.. వినూత్న రీతిలో చోరీలు చేసిన ప్రేమికుల జంట.. ఇల్లు అద్దెకిస్తారా అంటూ స్కెచ్
కర్ణాటకలో దొంగ ప్రేమికుల జంట చేస్తున్న నేరాలు వెల్లడయ్యాయి. ఇరువురూ కలిసి పక్కా స్కెచ్ వేసి ఇల్లు అద్దెకిస్తారా? అని యజమానులను ముగ్గులోకి దింపేవారు. ఆ ఇంట్లోకి అద్దెకు దిగి విలువైన వస్తువులు, నగదును దోచుకునేవారు. దొంతనాలు చేసి పోలీసులకు దొరికినా ప్రియురాలు మాత్రం.. ఆ రౌడీషీటర్ ప్రియుడి కోసం ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది.
బెంగళూరు: కర్ణాటకలో ఘరానా కపుల్స్ కథ బట్టబయలైంది. ఇద్దరు lovers వినూత్న రీతిలో crimes చేస్తూ దొరికిపోయారు. కేసులైనా, జైలుకెళ్లినా సరే.. ఇద్దరం ఒకరికొకరం అంటున్న ఆ జంట కథ మతిపోగొడుతున్నది. కర్ణాటకకు చెందిన వినయ్, కీర్తనలు మూడేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం అయ్యారు. ప్రేమించుకున్నారు. కానీ, ఆమె గిఫ్ట్‌లు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ కోసం అడ్డదారి తొక్కారు. ఈజీ మనీ కోసం sketchలు వేస్తూ గ్యాంబ్లింగ్‌కు పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో ఇల్లు అద్దెకిస్తారా? అని అడిగి అందులోకి rentకు దిగేవారు. తర్వాత ఆ ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించేవారు. బెంగళూరులో కొంతకాలంగా ఈ తరహా robbery జరుగుతన్నా.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. పోలీసులూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ దొంగతనాల కథను బట్టబయలు చేశారు. అద్దెకు ఇంటిలో దిగి దొంగతనాలకు పాల్పడుతున్నది.. వినయ్, కీర్తనలే అని పోలీసులు కనుగొన్నారు. వారిని అరెస్టు చేశారు.
వినయ్‌పై ఓ హత్య కేసు ఉన్నదని, పలు నేరాల్లోనూ నిందితుడిగా ఉన్నాడని కీర్తనకు తెలుసు. వినయ్‌పై రౌడీ షీట్ కూడా ఉన్నదని పోలీసులు తెలిపారు. కానీ, ఆ అపర ప్రేమికురాలు ఆయనను వదిలేది లేదని కరాఖండిగా చెప్పేసింది. వినయ్ రౌడీ షీటర్ అని తెలిసినా.. అతడినే లవ్ చేస్తున్నట్టు కీర్తన పోలీసులకు వెల్లడించింది. అతని కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జైలుకు వెళ్లడానికీ వెనుకాడబోరని చెప్పారు.
వినయ్, కీర్తలు లవ్‌లో ఉన్నారు. తనను లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని ఆమె తరుచూ డిమాండ్ చేసేదని తెలిసింది. ఇందుకోసమే వినయ్ దొంగతనాలు చేసేవాడని విచారణలో తేలింది. ఈ దొంగతనాలకు ఆమెను కూడా వెంట తీసుకెళ్లేవాడని తెలిసింది.
అక్టోబర్ 4న మారుతీనగర్‌లో వారిద్దరు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నట్టుగా తమను తాము ఆ ఇంటి యజమానికి పరిచయం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, రూ. 15వేల క్యాష్‌ను దొంగతనం చేశారు. తొలుత వీరిపై అనుమానం రాకున్నా ఆ యజమానులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ జంటే దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దొంగ ప్రేమికుల జంటను అదుపులోకి తీసుకున్నారు.