మరో డేరా బాబా: ఆశ్రమంలోనే మహిళపై బాబా రేప్

First Published 11, Jun 2018, 4:05 PM IST
molestation case registered against self styledgo dman daati maharaj in delhi
Highlights

బాబాపై రేప్ కేసు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వయం ప్రకటిత దేవుడి అవతారం అని చెప్పుకొనే మహారాజ్ బాబాపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.

మహారాజ్‌ ఆశ్రమం శనిధామ్‌లో రెండు సంవత్సరాల క్రితం తాను అత్యాచారానికి గురైనట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం తనపై లైంగిక దోపిడి జరిగినప్పటికి ప్రాణ భయం వల్ల జీవితం అల్లరి పాలవుతుందని భయపడి అత్యాచార విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 


స్వయం ప్రకటిత బాబాలుగా తమను తాము చెప్పుకొనే బాబాలు  మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఘటన  తీవ్రంగా కలకలం రేపుతోంది.

loader