మాజీ కేంద్ర సహాయక మంత్రిఎంజే అక్బర్ పరువు తీసేందుకే ఆయనపై మీటూ ఆరోపణలు చేశారని ఆయన మాజీ మహిళా సహోద్యోగురాలు జోయితాబసు అన్నారు.

ఎంజే అక్బర్ పై జర్నలిస్టు ప్రయా రమణి మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రియా రమణితోపాటు మరో 14మంది దాకా అక్బర్ పై మీటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది.  కాగా.. తన పరువుతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారంటూ ఎంజే అక్బర్ ప్రియా రమణిపై కొద్ది రోజుల క్రితం క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు. కాగా.. ఆ కేసు ఈ రోజు హియరింగ్ వచ్చింది.

ఈ కేసులో ఎంజే అక్బర్ కి ఆయన సహోద్యోగురాలు జోయితా బసు మద్దతుగా నిలిచారు. కేవలం ఎంజే అక్బర్ కి ఉన్న మంచిపేరు, ఆయన కీర్తి ప్రతిష్టలు పొగొట్టాలనే కారణంతోనే ఆయనపై ప్రియా రమణి ఆరోపణలు చేశారని ఆమె కోర్టులో తెలిపారు.

ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించాడంటూ ప్రియా రమణి చేసిన ట్వీట్లను తాను చూశానని జోయితా చెప్పారు. ఆ ట్వీట్లలో ఎలాంటి నిజం లేదని ఆమె కోర్టులో వివరించారు. ఆయనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని జోయితా పేర్కొన్నారు. తనకు ఎంజే అక్బర్ 20 సంవత్సరాలుగా తెలుసునని, అందరితోనూ మర్యాదగా ప్రవర్తిస్తారని ఆమె చెప్పారు.

ఎంజే అక్బర్ గురించి ఆయన సిబ్బంది  కానీ,తోటి ఉద్యోగులు కానీ ఎప్పుడూ ఒక మాట చెడుగా అనడం కూడా తాను వినలేదని జోయితా కోర్టుకు వివరించారు. ఆయనను కించపరిచేలా రమణి చేసిన ట్వీట్లు చూసి తాను మొదట ఆశ్చర్యపోయానని ఆమె అన్నారు. 

మరిన్ని వార్తలు చదవండి

నా ఒంటిమీద డ్రస్ తేసేసి రేప్ చేశాడు... ఎంజే అక్బర్ పై మరో జర్నలిస్ట్

పల్లవి వల్లే మా కుటుంబంలో అశాంతి: ఎంజె అక్బర్ భార్య

మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్