న్యూఢిల్లీ: మీటూ ఉద్యమంలో భాగంగా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై  జర్నలిస్ట్ పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై అక్బర్ భార్య మల్లికా అక్బర్  స్పందించారు. పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.

 

20 ఏళ్ల క్రితం తమ కాపురంలో పల్లవి గొగోయ్ కలతలను రేపారని  ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి పూట ఫోన్లు చేసి తన భర్తతో పల్లవి మాట్లాడేదని ఆమె గుర్తు చేశారు.  పబ్లిక్‌గానే తన భర్తపై ఆమె విపరీతమైన ప్రేమ చూపించేదన్నారు. బహిరంగంగానే ఇవన్నీ చూసీ తాను  తట్టుకోలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయమై తనకు తన భర్త అక్బర్‌కు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయన్నారు.

తమ కుటుంబంలో అశాంతికి పల్లవి గొగోయ్ కారణమని ఆమె తేల్చి చెప్పారు.  చివరకు తన భర్తలో మార్పు వచ్చిందని మల్లికా అక్బర్ చెప్పారు. ఆ తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

 అయితే  పల్లవి ఇప్పుడు ఎందుకు మాట మార్చారనే విషయం తనకు అర్ధం కావడం లేదన్నారు. పల్లవి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమె చెప్పారు.పల్లవి ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మల్లికా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

నా ఒంటిమీద డ్రస్ తేసేసి రేప్ చేశాడు... ఎంజే అక్బర్ పై మరో జర్నలిస్ట్