Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసులో బెయిల్‌పై నిందితుడు బయటకు.. బాధితురాలితోనే ప్రేమ పెళ్లి.. తల్లిదండ్రులకు రివర్స్ అయిన యువతి

యూపీలో ఓ వ్యక్తి.. మైనర్‌ను రేప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చి ఆ బాధితురాలితోనే ప్రేమలో పడ్డాడు. వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, ఆ బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని మభ్యపెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నిందితుడు, బాధితురాలు పెళ్లి చేసుకున్నట్టు వారు పోలీసులకు తెలిపారు. ఈ కేసును కోర్టు విచారించి తీర్పు వెలువరించనుంది.
 

minor girl rape accused came out on bail and married victim in UP
Author
Lucknow, First Published May 12, 2022, 6:34 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అరుదైన ఘటన జరిగింది. 2018లో రాహుల్ అనే వ్యక్తిపై రేప్ కేసు నమోదైంది. తమ మైనర్ కూతురిని రేప్ చేశాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో రాహుల్ జైలుకు వెళ్లాడు. ఇటీవలే రాహుల్ ఈ రేప్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కాలంలోనే రాహుల్.. ఆ బాధితురాలు ప్రేమలో పడ్డారు. ఇరువురూ కలిసి ఉండాలనుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. తాము పెళ్లి కూడా చేసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపెట్టారు. వారి పెళ్లిని బాధితురాలి తల్లిదండ్రులు అంగీకరించడం లేదని కూడా చెప్పారు. తామిద్దరిని కలిసి ఉండటానికి అనుమతించాలని ఇరువురూ పోలీసులను కోరారు. ఆ బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకోనుంది. కోర్టులోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.

కమలా నగర్ ఏరియాలని బల్కేశ్వర్ కాలనీ నివాసి రాహుల్. 2018లో ఆయన మైనర్ బాలికను రేప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు పంపారు. అనంతరం ఆయన ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కాలంలోనే ఆ మహిళ(మేజర్) నిందితుడితో ప్రేమలో పడింది. కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

దీంతో వారిద్దరూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును ఆశ్రయించారు. తన భర్తతో కలిసి జీవించడానికి అనుమతించాలని రేప్ కేసులో బాధితురాలు లేదా ఆ మహిళ పోలీసులను కోరింది. దీంతో పోలీసులు ఆ కేసును కోర్టుకు బదిలీ చేశారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు, రాహుల్‌ను తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టడానికి తన కుటుంబం ప్రయత్నిస్తున్నదనీ ఆమె పేర్కొనడం గమనార్హం. కాగా, ఆ బాధితురాలి కుటుంబం ప్రకారం, వారి కూతురు కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. రాహుల్ తన కూతురిని మభ్య పెడుతున్నాడని, ఆయనే తన కూతురిని మాటల్లోకి దించి తీసుకెళ్లి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. కానీ, ఇంతలోనే ఆ దంపతులు ఎస్ఎస్‌పీ దగ్గరకు వెళ్లారు. కాగా, ఆ మహిళ కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చే వరకు పోలీసుల పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నారు. కోర్టు విచారించి తీర్పు ఇచ్చిన తర్వాత తదుపరి చర్య లు తీసుకోబోతున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios