Asianet News TeluguAsianet News Telugu

భార‌తీయ క‌ళ‌ల‌కు ప్ర‌త్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఎంఎఫ్ హుస్సేన్’

ఎంఎఫ్ హుస్సేన్ భారతీయ కళలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయనపై పలు వివాదాలు ఉన్నప్పటికీ గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నారు. 95 ఏళ్ల పాటు జీవించిన ఆయన తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 

MF Hussain who brought a special place to Indian arts
Author
New Delhi, First Published Aug 8, 2022, 1:56 PM IST

ఆధునిక భారతీయ పెయింటింగ్ వేయ‌డంలో, ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయ క‌ళ‌ల‌ల‌కు ప్ర‌త్యేక స్థానాన్ని సృష్టించడంలో ఎంఎఫ్ హుస్సేన్ ప్ర‌సిద్ధి చెందారు. ఆయ‌న పెయింటింగ్స్, ర‌చ‌న‌ల్లో చాలా వరకు బోల్డ్, వైబ్రెంట్ రంగులు క్యూబిస్ట్ శైలిలో ఉప‌యోగించారు. ఎంఎఫ్ హుస్సేన్ ను పికాసో ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆయ‌న గొప్ప ఫోటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ కూడా. తన అద్భుతమైన కళాఖండాలకు అనేక జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 

Heavy rains: ముంబ‌యిలో భారీ వ‌ర్షాలు.. నాగ్‌పూర్, వార్దాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

1915 సంవ‌త్స‌రంలోని సెప్టెంబర్ 17 వ తేదీన మహారాష్ట్రలోని పండర్‌పూర్ దేవాలయం ఉన్న పట్టణంలో ఫిదా హుస్సేన్, జైనెబ్‌లకు ఆయ‌న జన్మించాడు. ఆయ‌న రెండు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే త‌న త‌ల్లిని కోల్పోయాడు. దీంతో తండ్రి మ‌రో వివాహం చేసుకొని ఇండోర్‌కు వెళ్లారు. అక్కడ హుస్సేన్ తన ప్రారంభ ప్రాథ‌మిక పాఠశాల విద్యను పూర్తి చేశారు.

అక్క‌డి నుంచి గుజరాత్‌లోని సిద్ధపూర్‌కు వెళ్లారు. అక్క‌డ క‌విత్వాలు రాయ‌డం ప్రారంభించారు. ఎంఎఫ్ హుస్సేన్ మొదటి పెయింటింగ్ గురువు NS బెంద్రే. ఆయ‌న‌ను హుస్సేన్ ఇండోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో కలుసుకున్నారు. కానీ ఆ డిప్లొమా కోర్సును మధ్యలోనే వదిలేసి బొంబాయికి వెళ్లాడు. జీవనోపాధి కోసం భిడేకి ఆయ‌న సహాయకుడిగా మారారు, ఆ స‌మ‌యంలో ఆయ‌న అత్యంత ఫేమ‌స్ సినిమాహోర్డింగ్ పెయింటర్ గా ఉన్నారు. దీంతో అత‌డి వ‌ద్దే 5 సంవత్సరాలు పెయింట‌ర్ గా ప‌ని చేశారు. 

వెంకయ్య నాయుడు పని విధానం స్పూర్తి దాయకం.. రాజ్యసభలో ప్రధాని మోదీ

హుస్సేన్ మాధురీ దీక్షిత్ ను అమితంగా అభిమానించేవారు. హమ్ ఆప్కే హై కౌన్‌ని 50 కంటే ఎక్కువ సార్లు చూశారు. ఆయ‌న మాధురి సినిమా ఆజా నాచ్లేను చూసేందుకు దుబాయ్‌లోని ఓ మొత్తం థియేటర్‌ని కూడా బుక్ చేసినట్లు నివేదిక‌లు ఉన్నాయి. క్రిస్టీ వేలంలో అతడి కాన్వాస్‌లలో ఒకటి 2 మిలియన్ డాల‌ర్లు ప‌లికింది. ఇంత పెద్ద మొత్తంలో వేలంలో అమ్ముడుపోయిన చిత్రాన్ని గీసిన భార‌తీయ చిత్ర‌కారుడిగా హుస్సేన్ చ‌రిత్రలో నిలిచారు.

బీజేపీ వర్కర్‌పై బుల్డోజర్ యాక్షన్.. నోయిడా సొసైటీలో కూల్చివేత 

1947లో బాంబే ఆర్ట్ సొసైటీ వార్షిక ప్రదర్శనలో హుస్సేన్ తన చిత్రాలకు అవార్డును గెలుచుకున్నారు. ఆయ‌న 1973లో పద్మ భూషణ్, 1991లో పద్మ విభూషణ్ అనే రెండు అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. హుస్సేన్ గీసిన అనేక చిత్రాలు బ్రిటిష్ పాలన, మహాత్మా గాంధీ, మదర్ థెరిసా, మహాభారతం, రామాయణం ఆధారంగా ఉన్నాయి. అత‌డు త‌న జీవితంలోని చివ‌రి ఐదు సంవ‌త్స‌రాలు ఇత‌ర దేశాల్లోనే గ‌డిపారు. 2011 సంవ‌త్స‌రం జూన్ 9వ తేదీన తన 95వ ఏట గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios