Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ వర్కర్‌పై బుల్డోజర్ యాక్షన్.. నోయిడా సొసైటీలో కూల్చివేత

చట్ట వ్యతిరేకంగా భూ ఆక్రమణకు పాల్పడిన బీజేపీ నేతపై యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆ బీజేపీ నేత పై కూడా యోగి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. నోయిడాలో ఓ మహిళతో దుర్భాషలాడిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి వీడియో వైరల్ అయిన తర్వాత ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం.
 

bulldozer demolishes bjp workers encroachment in noida uttarpradesh
Author
Lucknow, First Published Aug 8, 2022, 11:25 AM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన బుల్డోజర్ యాక్షన్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ యాక్షన్స్ మైనార్టీలపై తీసుకుంటున్నారనే అపవాదు వచ్చింది. ప్రత్యేకించి ఆందోళనలు చేసే.. ప్రభుత్వ విధానాలను నిరసించే వారినే లక్ష్యంగా చేసుకుని ఈ బుల్డోజర్ యాక్షన్స్ చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా, ఇందుకు భిన్నమైన కథనం వెలువడింది. ఏకంగా బీజేపీ వర్కర్‌పైనా ఈ బుల్డోజర్ యాక్షన్‌నే యూపీ ప్రభుత్వం చేపట్టింది.

నోయిడాలోని ఓ హౌజింగ్ సొసైటీకి చెందిన భూమిని బీజేపీ వర్కర్ శ్రీకాంత్ త్యాగి అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడని, ఇందులో భాగంగానే అక్కడ కొన్ని మొక్కలు నాటుతుండగా ఓ మహిళ అడ్డు చెప్పింది. ఆ మహిళపై శ్రీకాంత్ త్యాగి విరుచుకుపడ్డాడు. ఆమెను హడలెత్తించాడు. పై పైకి వెళ్లి బెదిరించాడు. దూషించాడు. ఆమె భర్తను కూడా తిట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచి శ్రీకాంత్ త్యాగి కనిపించకుండా పోయాడు. ఆయనపై పలు కేసులు నమోదైన ఆయన జాడ లేకుండా పోయింది. దీంతో యూపీ ప్రభుత్వం శ్రీకాంత్ త్యాగిపై యాక్షన్‌కు ఉపక్రమించింది.

నోయిడా పోలీసు టీమ్‌లు బుల్డోజర్లతో స్పాట్‌కు వెళ్లారు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఓమెక్స్ హౌజింగ్ సొసటీ ఉన్నది. ఈ సొసైటీ వద్దకు బుల్డోజర్లు వచ్చాయి. శ్రీకాంత్ త్యాగికి అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న చెబుతున్నవాటిని ఆ బుల్డోజర్లను కూల్చివేశారు. ఈ కూల్చివేతలను చూస్తూ హౌజింగ్ సొసైటీ నివాసులు సంబురాలు చేసుకున్నారు. చప్పట్లు కొడుతూ అరుపులతో ఆ చర్యను ఆస్వాదించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్, నోయిడా అథారిటీ సీఈవోలు తీసుకున్న యాక్షన్‌తో తాము సంతోషిస్తున్నట్టు వివరించారు. శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాలు, ఆయన యాటిట్యూడ్ కారణంగా తాము ఎంతో కలత చెందామని తెలిపారు.

యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ దీనిపై స్పందిస్తూ.. సీఎం ఈ మొత్తం కేసులను పర్యవేక్షణలోకి తీసుకున్నాడని వివరించారు. నిందితుడు తప్పించుకోకుంటా చూస్తామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీకాంత్ త్యాగిపై ఐపీసీలోని సెక్షన్ 354 కింద కేసు నమోదైంది. శుక్రవారం హౌజింగ్ సొసైటీలో నివసిస్తున్న ఓ మహిళతో ఆయన వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు శ్రీకాంత్ త్యాగిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ పెట్టారు. తద్వార ఆయన ఆస్తులను అటాచ్ చేయడం, కూల్చివేయడం సాధ్యమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios