Mumbai లో కరోనా విజృంభన.. 20 వేలు దాటితే లాక్ డౌన్..!
దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి తీవ్రం అవుతోంది. ముంబయిలో కొత్తగా 8,082 కేసులు బయటపడ్డాయి. 622 మంది కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 37,274గా ఉన్నాయి. ఈ తరుణంలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్ డౌన్ లాక్‌డౌన్ ప్రకటిస్తామని నగర పౌర సంఘం చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనా మరో సారి తన పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా వణుకు పుట్టిస్తోంది. ఒక్క రోజే గడిచిన 24 గంటల్లో 8,082 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో 574 మంది రోగులు ఆసుపత్రిలో చేరిగా.. మరో 622 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 37,274గా నమోదయ్యింది. తాజా కేసులతో కరోనావైరస్ సంఖ్య 8,07,602 కు పెరిగింది, అయితే మరణాల సంఖ్య 16,379 కు పెరిగింది. అయితే.. తాజాగా నమోదైన కేసుల్లో తొంభై శాతం ఎటువంటి లక్షణాలు లేకుండా, లక్షణరహితంగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు.
ఆదివారం రోజు నమోదైన 8063 కేసులతో పోలిస్తే .. ఈ రోజు కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉంది. అయితే.. కానీ ఆదివారం ఆసుపత్రుల్లో చేరినా సంఖ్యతో పోల్చుకుంటే.. ఆ సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఇలా కరోనా కేసులు పెరుగుతుంటే.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి దశలో ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తోన్నారు.
Read Also : ఒమిక్రాన్.. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమే.. కానీ, జాగ్రత్తగా ఉండాలి: యూపీ సీఎం యోగి
ఇదిలాఉంటే.. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటితే లాక్ డౌన్ లాక్‌డౌన్ ప్రకటిస్తామని నగర పౌర సంఘం చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కరోనా విస్తరణ, లాక్‌డౌన్ గురించి చర్చించామని తెలిపారు. ఈ సమయంలో రోజుకు 30 వేల కేసుల వరకు కావలసిన అన్ని వైద్య వసతులు కల్పిస్తున్నామని, ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఆయన అన్నారు.
Read Also : Coronavirus: మెడికల్ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా
ఇదిలా ఉంటే.. తాము రాష్ట్ర టాస్క్ ఫోర్స్‌లోని నిపుణుల ఇన్‌పుట్‌లను తీసుకుంటున్నామని, వారి అభిప్రాయం ప్రకారం ఓమిక్రాన్ ఇప్పుడు 80 శాతం (కోవిడ్ కేసులలో) ఉందని చెప్పారు . ఈ 80 శాతం కూడా రాబోయే కొద్ది రోజుల్లో 90 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. మరో వారం పదిరోజుల్లో కేసుల సంఖ్య తీవ్రమవబోతున్నట్టు తెలిపారని అన్నారు. మహమ్మారి బారిన పడినప్పటి నుండి మహారాష్ట్రలో 67 లక్షల ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో నిన్న 11,877 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, మునుపటి రోజు కంటే 29 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 8,063 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.కరోనా సెకండ్ వేవ్ తరువాత.. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనర్హం.