తెలంగాణలో Lockdownపై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాసరావు.. ఆయన ఏం చెప్పారంటే..
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో లాక్‌డౌన్ వార్తలపై డీహెచ్ శ్రీనివాసరావు (Srinivas Rao) క్లారిటీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ (Omicron) కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. నైట్ కర్ఫ్యూల విధించడమే కాకుండా జనాలు పెద్ద ఎత్తున చేరే ప్రదేశాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుతు జనవరి 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండగా.. వాటిని జనవరి 10వ తేదీ వరకు పొడిగించారు.
స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పిల్లలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ సిటిజన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ -19 రూల్స్ కచ్చితంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లను, పోలీసు సూపరింటెండెంట్‌లను ప్రభుత్వం ఆదేశించింది.
అయితే తెలంగాణ ఇటీవల కేసుల సంఖ్య మరింతంగా పెరగడం, ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరడంతో.. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో లాక్‌డౌన్ వార్తలపై డీహెచ్ శ్రీనివాసరావు (Srinivas Rao) క్లారిటీ ఇచ్చారు. నేడు 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన డీహెచ్ శ్రీనివాసరావు.. పిల్లలకు ప్రస్తుతం నిర్దేశిత వ్యాక్సినేషన్ సెంటర్లలో మాత్రమే టీకాలు వేస్తున్నట్టుగా చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించిందన్నారు.
రాబోయే రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఎక్కువగా చూస్తామని అన్నారు. అయితే పెరుగుదలకు భయపడాల్సిన పనిలేదని.. కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా ప్రజలు పెద్ద ఎత్తున ఒకే చోటకు చేరే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తున్నామనేది పూర్తిగా అవాస్తం అని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రెండు వేవ్‌లు నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని.. ఆంక్షలు, నైట్ కర్ఫ్యూల ద్వారా వైరస్‌ను అడ్డుకోలేమని అన్నారు. ఒమిక్రాన్‌తో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని.. దీనిద్వారా కొద్ది శాతం మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే థర్డ్ వేవ్ నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు.