Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్‌లో భారీ కుంభకోణం.. ఆడిట్ లో బ‌య‌టప‌డ్డ వాస్త‌వాలు  

మధ్యప్రదేశ్‌లో భారీ కుంభకోణం బ‌య‌ట‌ప‌డింది. పాఠ‌శాల విద్యార్థుల‌కు అందించే ఆహార పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది.  

Massive Scam Under Madhya Pradesh Chief Minister Watch
Author
First Published Sep 4, 2022, 9:26 PM IST

మధ్యప్రదేశ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వ‌చ్చింది. పాఠశాల విద్యార్థుల‌కు అందించే మధ్యాహ్న భోజన పథకంలో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింది. ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌తలు జ‌రిగిన‌ట్టు ఆ రాష్ట్ర‌ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది. కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాల్లో ఈ ప్రతిష్టాత్మక పథకం భారీ స్కామ్ జ‌రిగింది.

స్కామ్  ఏమిటంటే..?
 
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) పథకంలో 2018- 2021 మ‌ధ్య‌కాలంలో  భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు అకౌంటెంట్ జనరల్ 36 పేజీల నివేదికను విడుదల చేసింది.  అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం.. పాఠ‌శాల విద్యార్థుల‌కు అందించే  మధ్యాహ్న భోజన పథకంలో లబ్ధిదారుల సంఖ్య, పంపిణీ, ఆహారం నాణ్యతలో భారీగా లోపాల‌ను గుర్తించింది. 

 రూ. 6.94 కోట్ల విలువైన 1125.64 మెట్రిక్ ట‌న్నుల టేక్ హోమ్ రేషన్ పంపిణీ కోసం  6 ప్లాంట్లు/సంస్థలు
వినియోగించిన లారీల రిజిస్టర్‌ నంబర్లు నకిలీ అని తేలింది.  డేటాబేస్‌లో ట్రక్కులు అస్సలు లేవనీ,
 వాస్తవానికి ఆ రిజిస్టర్‌ నంబర్లు మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లకు చెందిన‌విగా రవాణా శాఖ రికార్డుల ద్వారా తేలింది.

THR పంపిణీ కోసం బడి బయట ఉన్న కౌమార బాలికల (OOSAGs) గుర్తింపు కోసం బేస్‌లైన్ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నప్పటికీ, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (WCD) ఫిబ్రవరి 2021 నాటికి బేస్‌లైన్ సర్వేను పూర్తి చేయలేదని ఆడిట్ గుర్తించింది. 2018- 2021 మధ్య కాలంలో అంగన్‌వాడీ కేంద్రాలను సంబంధిత అధికారులు ఏ మాత్రం తనిఖీ చేయలేదనీ, పర్యవేక్షణ లేకపోవడం వ‌ల్ల నాణ్యత లేని ఆహార పంపిణీ జరిగిందని ఆడిట్  గుర్తించింది. 

అలాగే..  ఆడిట్‌ నివేదిక ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో.. 9 వేలు మంది విద్యార్థులు ఉచిత ఆహార పంపిణీ పథకంలో లబ్ధిదారులుగా న‌మోద‌య్యారు. కానీ, ఎలాంటి సర్వే నిర్వహించకుండానే 2021 నాటికి లబ్ధిదారుల సంఖ్య  ఏకంగా 36.08 లక్షలకు చేరిన‌ట్టు ఆడిట్ గుర్తించింది.   8 జిల్లాల్లోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడిట్‌ నిర్వహించగా  కేవలం మూడు జిల్లాలోనే రేషన్‌ పొందుతున్న స్కూల్‌ బాలికల నమోదయ్యాయని ఆడిట్ వెరిఫికేషన్ నివేదిక వెల్లడించింది. 
 
అయితే 2018-21 విద్యా సంవ‌త్స‌రంలో MIS పోర్టల్‌లో  63,748 మంది బాలికలను న‌మోదు చేసుకుని  
 29,102 మందికి సహాయం చేసినట్లుగా డబ్ల్యూసీడీ పేర్కొంది. ఈ క్ర‌మంలో డాటా మానిప్యులేషన్‌ ద్వారా రూ.110.83 కోట్ల విలువైన టేక్ హోమ్ రేషన్ (THR) బోగస్ పంపిణీని చేసిన‌ట్టు ఆడిట్ గుర్తించింది. 


బడి, ధార్, మండల, రేవా, సాగర్చ‌,  శివపురిలోని ఆరు ప్లాంట్లు నుంచి 4.95 కోట్ల విలువైన  821.558 మెట్రిక్ ట‌న్నుల THRని చలాన్ జారీ చేసిన తేదీన  రేష‌న్  స్టాక్ లేన‌ప్ప‌టికీ సరఫరా చేసిన‌ట్టు న‌మోదు చేశార‌నీ, అలాగే..  ఎనిమిది జిల్లాల్లో, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారులు  97,656.3 మెట్రిక్ ట‌న్నుల రేష‌న్ ని పోందిన‌ప్ప‌టికీ కేవ‌లం 86,377.5  మెట్రిక్ టన్నుల రేష‌న్ మాత్ర‌మే  అంగన్‌వాడీలకు రవాణా చేశారు.మిగిత‌ సరుకులు మాయం అయినట్లు బయటపడింది.

ప్రాజెక్ట్, అంగన్‌వాడీ స్థాయిలలో తయారు చేయబడిన THR నమూనాలను రాష్ట్రం వెలుపల నాణ్యత తనిఖీల కోసం స్వతంత్ర ప్రయోగశాలలకు పంపవలసి ఉంది. కానీ ఇది చేయలేదు. దీంతో లబ్ధిదారులకు అందిన టీహెచ్‌ఆర్‌ నాణ్యత నాసిరకంగా ఉందని తేలింది. 8 ఆడిట్ చేయబడిన జిల్లాల్లో, CDPOలు 2018-21లో అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీని నిర్వహించలేదు, అంతర్గత నియంత్రణ లేద‌ని గుర్తించారు. 

 ఉప ఎన్నికల్లో ఇమర్తి దేవి ఓటమితో ఆమె మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ)కు రాజీనామా చేశారు. దీంతో 2021 నాటి నుంచి  సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) ఉంది. దీంతో సీఎం కనుసన్నల్లోనే..  భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios