దుమ్ము, ధూళి భారీగా వాతావరణంలో కలిసిపోయి ప్రతి ఏటా ఢిల్లీ వాసులు ఎదుర్కొనే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కానీ ఈసారి లాక్‌డౌన్ పుణ్యమా అని జనం నాలుగు గోడల మధ్య బందీ అయిపోవడంతో వాతావరణంలో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Also Read:ఇండియాలో 63 వేలకు చేరువలో కరోనా కేసులు: 2 వేలు దాటిన మరణాలు

గాలి స్వచ్ఛంగా మారిపోవడంతో నగర వాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ధూళి తుఫాన్ ముంచెత్తింది.

దీంతో నగరంలోని పలు చోట్ల పగటిపూటే చీకట్లు కమ్మేశాయి. ముఖ్యంగా ఘాజీపూర్ ప్రాంతంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ధూళి తుఫాను కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Also Read:ఢిల్లీలో భూప్రకంపనలు.. నెల రోజుల్లో వరుసగా మూడోసారి, జనం పరుగులు

ఉష్ణోగ్రతలు తగ్గిపోయి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. రాగల 48 గంటల్లో నగరంలో ఆకాశం మేఘావృతంగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాగా ఆదివారం ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా 1.45 నిమిషాలకు భూకంపం వచ్చింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. మరోవైపు నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో భూప్రకంపనలు రావడం ఇది మూడోసారి.