జార్ఖండ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అడవిలో ఐఈడీ అమర్చి దానిని పేల్చడంతో ఓ యువకుడు చనిపోయాడు. ఆ యువకుడు అడవిలోకి కట్టేలు సేకరించేందుకు వెళ్లినప్పుడు ఇది చోటు చేసుకుంది. 

జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్‌భూమ్‌లోని చైబాసాలోని గోయిల్‌కేరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేరల్‌గడ గ్రామ సమీపంలో మావోయిస్టులు జరిపిన ఐఈడీ పేలుడులో 23 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అతడు కట్టెలు సేకరించేందుకు అడవికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

రాజ్‌భవన్‌లు వారసులను సృష్టించే ప్యాలెస్‌లు కాదు.. తమిళ ఎంపీకి గవర్నర్ తమిళిసౌ కౌంటర్..

ఈ ఘటనపై చైబాసా ఎస్పీ అశుతోష్ శేఖర్ మాట్లాడుతూ.. చైబాసాలోని గోయిల్‌కేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మేరల్‌గాడ గ్రామ సమీపంలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారని చెప్పారు. దీంతో యువకుడు చనిపోయాడని చెప్పారు. ఇది పిరికి పంద చర్యగా ఎస్పీ అభివర్ణించారు. ఉగ్ర‌వాదుల‌పై జిల్లా పోలీసులు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తార‌ని, గ్రామ‌స్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని అన్నారు.

హవాలా ఆరోపణలు.. జోయ్ ‌అలుక్కాస్ జ్యూవెలరీస్‌లో ఈడీ సోదాలు

రెంగర్‌బెడ గ్రామ సమీపంలో సోమవారం రాత్రి మావోయిస్టులు ఓ చెట్టును కూల్చివేసి, ఆపరేషన్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించి రోడ్డుకు అడ్డంగా దిగ్బంధనం చేశారని ఎస్పీ తెలిపారు. ఇది కాకుండా కుయిరా, సోయిటాబా మధ్య ఇచ్ఛాటు ప్రధాన రహదారిపై ‘‘నకిలీ ఐఈడీ’’ అమర్చారని, దానిని పోలీసులు క్లియర్ చేశారని చెప్పారు.

ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎవరు? ఆమె గురించి కీలక వివరాలు ఇవే

చైబాసాలోని కొల్హాన్ అడవుల్లో మిసిర్ బెస్రా, పతిరామ్ మాఝీ అలియాస్ అనల్ దాతో పాటు కొంతమంది సీనియర్ మావోయిస్టు నాయకులు దాక్కున్నారనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. జనవరి నుండి జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో ఐఈడీ పేలుళ్ల వేర్వేరు ఘటనలలో 15 మంది సీఆర్ పీఎఫ్, జార్ఖండ్ జాగ్వార్ సిబ్బంది గాయపడ్డారు. అయితే భద్రతా బలగాలు అడవుల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మావోయిస్టులు ఐఈడీలను అమర్చారు. దీని కారణంగా ఆపరేషన్ సమయంలో పేలుళ్ల సంఘటనలు తరచుగా జరుగుతాయి.

బర్డ్ ఫ్లూ క‌ల‌కలం.. వంద‌లాది కోళ్లు మృతి, అప్రమత్తమైన ప్రభుత్వం

ఆసక్తికరమైన విషయమేమిటంటే కోల్హాన్ అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు కరపత్రాలను పంచిపెట్టారు. గ్రామస్థులు ఐఈడీపై నడిచి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నందున అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. అయితే మావోయిస్టులు ఆ ప్రాంతమంతా ఐఈడీలను అమర్చినప్పటికీ.. బలగాలు దృఢ సంకల్పంతో అడవుల్లోకి మెల్లగా కదులుతున్నాయి. వాటి ప్రధాన ప్రాంతాల్లో పలు తాత్కాలిక భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు. కాగా.. గతేడాది అక్టోబర్-నవంబర్ లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ పేలుళ్లలో ఇద్దరు పౌరులు మరణించారు.