తమిళనాడుకు చెందిన సీపీఎం నేత, లోక్‌సభ సభ్యులు ఎస్‌ వెంకటేశన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. 

తమిళనాడుకు చెందిన సీపీఎం నేత, లోక్‌సభ సభ్యులు ఎస్‌ వెంకటేశన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజా ఎస్‌ వెంకటేశన్ కామెంట్స్‌కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన తమిళిసై.. గవర్నర్ కావడానికి చాలా ప్రత్యేక అర్హతలు ఉన్నాయని, అలాంటి వాటిని మీరు పొందలేరని విమర్శించారు. వివరాలు.. ఇటీవలికాలంలో తమిళిసై సౌందర్‌ రాజన్, ఎల్ గణేశన్, సీపీ రాధాకృష్ణన్ వంటి బీజేపీ నేతలను వివిధ రాష్ట్రాల గవర్నర్‌లుగా నియమించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కోయంబత్తూరులో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. “తమిళ ప్రజలు సమర్థత, పరిపాలనా సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించరు. కానీ కేంద్ర ప్రభుత్వం మా సామర్థ్యాన్ని గుర్తించింది. తమిళనాడు ప్రజలు మమ్మల్ని గుర్తించి ఉంటే ఎంపీలుగా పార్లమెంటుకు వెళ్లి ఉండేవాళ్లం. మేం కేంద్ర మంత్రులు అయ్యేవాళ్లం. కానీ మేము ఓడిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మా ప్రతిభను గుర్తించి, దానిని వృథా చేయకూడదని భావించి గవర్నర్‌లుగా నియమించారు’’ అని పేర్కొన్నారు.

దీనిపై మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ స్పందిస్తూ.. రాజ్‌భవన్‌లన్నీ చెడ్డ విద్యార్థులు చదివే ట్యుటోరియల్ కాలేజీలని అంటున్నారా? అని ప్రశ్నించారు. పరీక్షలో ఫెయిల్ అయినవారిని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారంటే.. ఇది నకిలీ సర్టిఫికేట్ కాదా? అని ప్రశ్నించారు. 

Scroll to load tweet…


అయితే ఈ వ్యాఖ్యలపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ‘‘రాజ్ భవన్‌లు ట్యుటోరియల్స్ అని వెంకటేశన్ చెప్పారు. ట్యుటోరియల్స్ మురికి ప్రదేశం కాదు.. నేర్చుకునే పవిత్ర స్థలం కూడా. ఎన్నికల విజయం ఒక్కటే వ్యక్తికి గుర్తింపు కాదు.. రాజ్‌భవన్‌లు శిక్షణా వర్క్‌షాప్‌లు కావొచ్చు.. అయితే వారసులను తయారు చేసుకునే రాజభవనం కాదని గర్విస్తున్నాను. నిన్న గెలిచిన వారు రేపు ఓడిపోవచ్చు... నిన్న ఓడిపోయిన వారు రేపు గెలుపొందవచ్చు. చింతించకండి... గవర్నర్ కావాలంటే ఎన్నో ప్రత్యేక అర్హతలు కావాలి... ఇలాంటి అర్హతలు మీకు రావు.. మళ్లీ చెబుతున్నాను. పశ్చాత్తాపపడకండి’’ అని తమిళిసై వరుస ట్వీట్స్ చేశారు.