దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అల్లూకాస్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్ట్‌కు నిధులు మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లుగా తెలుస్తోంది.
దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అల్లూకాస్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ సంస్థ రూ.300 కోట్ల నగదును బదిలీ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. హవాలా ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు . 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్ట్‌కు నిధులు మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లుగా తెలుస్తోంది. సెబిలో రూ.2 వేల కోట్ల ఐపీఓకి జోయ్ అలుక్కాస్ దరఖాస్తు చేసింది. అయితే ఉన్నట్లుండి ఐపీవోను జోయ్ అలుక్కాస్ సంస్థ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
