ప్రధాని మోదీ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన క్రీడాకారిణి (వీడియో)

Manika Batra accepts PM Modi's fitness challenge
Highlights

అధికారిక ట్విట్టర్ లో వీడియో పోస్ట్...

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మొదలుపెట్టిన ఫిట్ నెస్ చాలెంజ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ చాలెంజ్ ను ప్రముఖ రాజీయ నాయకులతో పాటు సినీ తారలు, క్రీడాకారులతో వివిద రంగాల ప్రముఖులు స్వీకరించడమే కాదు మరికొంత మందికి చాలెంజ్ విసురుతున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో వీరి ఫిట్ నెస్ వీడియోలు దర్శనమిస్తున్నారు.

తాజాగా దేశ ప్రధాని మోదీ కూడా టీం ఇండియా కెప్టెన్ విరాట్ చాలెంజ్ ను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రకృతితొ మమేకమవుతూ తాను ఫిట్ నెస్ కోసం శ్రమిస్తానని ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ  చాలెంజ్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి, టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి మానిక బత్రా తో పాటు  40ఏళ్లు పైబడిన ఐపీఎస్ అధికారులందరూ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.

అయితే ఈ చాలెంజ్ ను క్రీడాకారిణి మానిక బత్రా స్వీకరించారు. తాను ఫిట్ నెస్ కోసం చేసే యోగాసనాలను వీడియో తీసి అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమె బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, క్రీడాకారులు అభినవ్ బింద్రా,సచిన్,వీరేంద్ర సెహ్వాగ్ లకు ఫిట్ చాలెంజ్ విసిరింది.

ఇక మరోవైపు మోదీ చాలెంజ్ ను కర్ణాటక సీఎం కుమార స్వామి తిరస్కరించిన  విషయం తెలిసిందే. తాను రోజూ యోగా తో పాటు ట్రెడ్ మిల్ చేస్తానని, అందువల్ల తాను ఫిట్ గానే ఉన్నానని ట్విట్ చేశారు. అయితే తాను తమ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రధానికి సమాధానం ఇచ్చారు.  
 

 

loader