Asianet News TeluguAsianet News Telugu

నిప్పుతో చెలగాటం చేస్తే ఇలానే ఉంటుంది.. వైరల్ వీడియో...!

ఆ నోట్లో పోసుకున్న పెట్రోల్ ని.. చేతిలో నిప్పుతో ఉన్న కర్రపై వూయాలని అనుకున్నాడు. కానీ పొరపాటున.. ఆ నిప్పు కాస్త అతని గడ్డానికి అంటుకుంది.

Man beard catches fire as he performs dangerous stunt in viral video
Author
First Published Oct 31, 2022, 10:10 AM IST

ఓ యువకుడు నిప్పుతో చెలగాటం ఆడాడు. నిప్పుతో ఏదో ఫీట్ చేయాలని ప్రయత్నించాడు. అది కాస్ట బెడసి కొట్టడంతో... ఏకంగా అతని గడ్డానికి ఆ నిప్పు అంటుకుంది. గడ్డంతో పాటు.. ముఖానికి కూడా కాస్త గాయాలు అయ్యాయనే చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ యువకుడు నిప్పుతో స్టంట్ చేయాలని అనుకున్నాడు. దాని కోసం అందరూ  చూస్తుండగా.... నోట్లో పెట్రోల్ పోసుకొని చేతిలో నిప్పు పెట్టుకున్నాడు. ఆ నోట్లో పోసుకున్న పెట్రోల్ ని.. చేతిలో నిప్పుతో ఉన్న కర్రపై వూయాలని అనుకున్నాడు. కానీ పొరపాటున.. ఆ నిప్పు కాస్త అతని గడ్డానికి అంటుకుంది. ఇంకేముంది.. ఆ నిప్పు కి గడ్డం కాలిపోయింది. కాస్త ముఖానికి కూడా ఆ నిప్పు అంటుకోవడం గమనార్హం. వెంటనే పక్కన ఉన్నవారు స్పందించి.. ఆ నిప్పు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ... ఈ ఘటన స్థానికంగా అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది.

 

రవి పాటిదార్ అనే వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. దాదాపు 12 మిలియన్ల మంది ఈ వీడియోని వీక్షించడం గమనార్హం. నెటిజన్లు సైతం వీడియో చూసి భయపడుతున్నారు. నిప్పుతో ఆటలుు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలీదు.. కానీ.. వీడియో మాత్రం వైరల్ గా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios