PM Modi Nomination: నేడు వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్.. ఈ ముహూర్తం అంతా బలముందా?
PM Modi Nomination: పార్లమెంట్ ఎన్నికలు 2024లో భాగంగా ప్రధాని మోడీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ నామినేషన్ దాఖాలు చేసిన సమయం, ముహుర్తం ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఏ ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయనున్నారో తెలుసా?
PM Modi Nomination: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకుని గంగామాతకు పూజలు చేశారు. గంగాపూజ, దుగ్ధ అభిషేకం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాలభైరవుని దర్శనం చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఆయన నామినేషన్ వేసే సమయానికి సంబంధించి పెద్ద వార్త బయటకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్‌కు శుభ ముహూర్తం ఖరారైంది. ఉదయం 11:40 గంటలకు ప్రధాని నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఇప్పటికే నామినేషన్ కు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. ఇందుకు ఒక శుభ ముహూర్తం నిర్ణయించారు. ఈ శుభ ముహూర్తాన్ని దేశంలోని గొప్ప జ్యోతిష్య పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ పెట్టారు.
కాశీ కొత్వాల్ బాబా కాలభైరవుని ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ముహూర్తం, ఆనంద యోగం, సావర్థసిద్ధి యోగంతో కూడిన పుష్య నక్షత్రంలో ఉదయం 11:40 గంటలకు అభిజీత్ ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పుష్య నక్షత్రాన్ని అన్ని రాశుల చక్రవర్తిగా చెబుతారు. నామినేషన్ సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సహా 40 మంది వీవీఐపీలు కలెక్టరేట్‌లో ఉండవచ్చు.
ఈ ముహూర్తం ప్రత్యేకమైనది..
గంగా సప్తమి, పుష్య నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, అభిజీత్ ముహూర్తాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నామినేషన్ రోజున ఉండడం చాలా ప్రత్యేకమైనదనిగా చెప్పవచ్చు. కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీ జాతకం ప్రకారం ఆయనకు పుష్య నక్షత్రం అనుకూలమని రాంనారాయణ్ ద్వివేది తెలిపారు. ఈ నక్షత్రంలో ఏ పని చేసినా అందులో విజయం ఖాయం. 27 రాశులలో ఈ రాశికి హిందూ వేద జ్యోతిషశాస్త్రంలో ఉత్తమ రాశి హోదా ఇచ్చారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ నక్షత్రం రోజున చేసే అన్ని పనులు విశేష విజయాన్ని ఇస్తాయని నమ్ముతారు. అలాగే, రాజరిక శక్తి కలయిక జరుతుందని తెలిపారు. ఇలాంటి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తాయని పండితులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:43 ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ నక్షత్రం మధ్యాహ్నం 3:10 గంటల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత అశేష నక్షత్రం మొదలవుతుంది.
నామినేషన్ సమయంలో గ్రహాల స్థానం కూడా ఉత్తమంగా ఉంటుందని ద్వివేది చెప్పారు. ఈ కాలంలో చంద్రుడు కూడా ఎనిమిదవ ఇంట్లో ఉండడు కాబట్టి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నామినేషన్ వేసే సమయానికి రాహుకాలం ఉండదు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనకు, రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనకు మంచి మూహూర్తం పెట్టిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ కూడా ఆ శుభముహూర్తమే అత్యుత్తమమని అభివర్ణించారు.
ఆనంద యోగా అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవులు చేసే పనులకు 12 రాశులు , 27 యోగాలకు మంచి సంబంధాలు ఉంటాయంటున్నారు పండితులు. విష్కుంభం నుంచి మొదలు కుని వైధృతి వరకు మొత్తం 27 యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు మానవుడు చేసే ప్రతి పని పై ప్రభావం చూపిస్తాయి. శుభ, అశుభ ప్రభావాలన్నీ ఈ యోగాల్లో ఉంటాయి. అలాగే ఈ రోజున ఆనంద యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏర్పడిన సమయంలో కొత్త ఉద్యోగం, కొత్త పనులు మొదలు పెట్టేందుకు ఉత్తమంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున జన్మించిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నమ్ముతారు.