Mamatha Banerjee: కమలం ఖతమే.. గోవాలో దూకుడు పెంచిన మమతా బెనర్జీ!
Mamatha Banerjee: దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు విస్తారించాలనుకుంటున్న టీఎంసీ దానికి అనుగుణంగా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న గోవాలో దూకుడు పెంచింది. కమళాన్ని ఖతం చేయడమేనంటూ.. మమతా బెనర్జీ గోవా పర్యటనలో బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mamatha Banerjee: వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ పొలిటికల్ హీటును పెంచారు. గోవాలోనూ ఎన్నికల వేడి మొదలైంది. ఈ సారి గోవాలో పాగావేయాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఎన్నిల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) గోవా ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ తనదైన శైలీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. "ఖేల్ జట్లో" నినాదాన్ని లేవనెత్తారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం బీజేపీ టార్గెట్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గోవా రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి ఇతర పార్టీలన్ని తృణమూల్ కాంగ్రెస్ కలిసిరావాలని అన్నారు.
Also Read: Revanth Reddy | తెలంగాణలో రైతన్నల మరణమృదంగం మోగుతోంది.. ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మమతా బెనర్జీ దానికి వచ్చే జరిగే ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతోంది. ప్రస్తుతం గోవాపై కన్నేసిన మమతా బెనర్జీ.. అక్కడ రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఇటీవలి కాలంలో గోవా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఆమెతో పాటు టీఎంసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఈసారి పర్యటనలో పాల్గొంటున్నారు. గోవాలో అధికారం చేజిక్కించుకోవాలనుకుటుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలోని పురాతన ప్రాంతీయ సంస్థ - మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో పొత్తు పెట్టుకుంది. ఎంజీపీ-టీఎంసీ రెండు పార్టీల నేతలతో కలిసి మమతా బెనర్జీ గోవాలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గోవాలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికే గోవాలో టీఎంసీ పోటీ చేస్తోందన్న విమర్శలను ఆమె ఖండించారు. బీజేపీని ఒడించడానికి ఇతర పార్టీలు కలిసి రావాలన్నారు.
Also Read: MLC Elections | అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ కలవరం !
మూడు సమావేశాల్లో పాల్గొన్న మమతా బెనర్జీ.. మూడు ప్రధాన హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వీటిని తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేసింది. వాటిలో ప్రధానమైనది గృహలక్ష్మీ పథకం. తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామనీ, ఈ పథకం కింద గోవా మహిళలు నెలకు రూ. 5,000 అందిస్తామని మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ తో పాటు బీజేపీ,కాంగ్రెస్, ఆప్ పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. గోవాలో తాము ఏ పార్టీతో పోటీ పెట్టుకోబోమని ఆప్ వెల్లడించింది. టీఎంసీ హామీల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు.. మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇప్పటికే ఇతర పార్టీలు ప్రకటిస్తున్న ఎన్నికల హామీలపై ఆ దేవుడే కాపాడాలంటూ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, గోవాలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలోకి జంప్ కావడానికి చూస్తుండటంతో రాజకీయాలు మరింత కాకరేపుతున్నాయి.
Also Read: Madhusudhana Chary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి