Madhusudhana Chary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
Madhusudhana Chary: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ఎన్నికయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ మధుసూధనాచారి పేరును ప్రతిపాదిస్తూ.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫైలు పంపారు. మంగళవారం దీనికి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Madhusudhana Chary: తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గవర్నక్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను సైతం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. గవర్నక్ కోటాలో ముఖ్యమంత్రి ఎవరికి అవకాశం కల్పించనున్నారనే దానిపై ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగింది. ఇదివరకు పలువురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పంపింది. ఈ నేపథ్యంలోనే గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించినసంగతి తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనకు గవర్నర్ తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అభ్యర్థిని ఆమోదం కోసం పంపించడం జరిగింది.
Also Read: coronavirus | దేశంలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నంటే?
కాగా, తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్యేల కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్ సభ్యులు కడియం శ్రీహరి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డిలతో పాటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదానాచారి పేరును రాజ్‌భవన్ కు పంపడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇదిలావుండగా, సిరికొండ మధుసుదనాచారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ కు వెన్నంటే ముందుకు సాగుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. స్పీకర్‌గానూ ఆయన సేవలందించారు. ఇక 2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
Also Read: Omicron Variant | దేశంలో 41 ఒమిక్రాన్ కేసులు.. ముందస్తు చర్యలు తీసుకోకుంటే విపత్తే..
అప్పటి నుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. అయితే, రాజకీయాల్లో మాత్రం చురుగ్గానే కదులుతున్నారు. పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ వెంటే ఉంటూ.. నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే మధుసుదనాచారి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వం. గతంలో ఆయన స్పీకర్ గానూ సేవలందించారు. కాబట్టి మధుసుదనాచారిని శాసన మండలి ఛైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సైతం ఈ చర్చ జరుగుతున్నదని సమాచారం. దీనికి బలం చేకూరేలా.. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసే సమయానికి మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నారని తెలిసిందే. ఇదే గనక నిజమైతే మధుసుదనాచారిని శాశన మండలి చైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయి. దీనికి తోడు గుత్తా సుఖేందర్ రెడ్డిని త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారనే ప్రచారం సైతం పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది. శాసన మండలి చైర్మన్ రేసులో ఉన్నట్టు మరొకరి పేరుకూడా వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి పేరు కూడా మండలి ఛైర్మన్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: Justice Chandru: అవగాహన లేని మాటలు.. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం