MLC Elections | అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ క‌ల‌వ‌రం !

MLC Elections: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కారు జోరు కొన‌సాగింది.  ఆరు స్థానాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే, ప‌లు చోట్ల అధికార పార్టీకి ప‌డాల్సిన ఓట్లు క్రాస్ అయ్యాయి. ప్ర‌స్తుతం అధికార పార్టీలో ఈ క్రాస్ ఓటింగ్ క‌ల‌వ‌రం రేపుతోంది. 
 

TRS fears cross voting in MLC Elections

MLC Elections: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కారు జోరు కొన‌సాగింది.  మొత్తం ఆరు స్థానాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. మంగ‌ళ‌వారం  వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో  టీఆర్ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రరెడ్డి, శంభీపూర్ రాజు, నిజామాబాద్ నుండి కవిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.  ఇక మిగిలిన ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. ప్ర‌స్తుతం వెలువ‌డిన ఫ‌లితాల్లో గులాబి పార్టీ గుభాలించింది. అన్ని స్థానాల్లోనూ విజ‌యం సాధించింది.  ప్ర‌తిప‌క్ష పార్టీల అభ్య‌ర్థులు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని మొత్తం స్థానాల‌ను గ‌మ‌నిస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కానీ.. 

Also Read: Madhusudhana Chary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

 ప‌లు చోట్ల క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంతో  అధికార టీఆర్ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థికి క్రాస్‌ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఓట్ల వివ‌రాలు గ‌మ‌నిస్తే..  కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు ఉన్నాయి. అయితే, ఇటీవ‌ల చాలా మంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ బ‌లం త‌గ్గిపోయింది.  వలసల తర్వాత కాంగ్రెస్‌లో మిగిలింది 96 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే. అయితే, మంగ‌ళ‌వారం నాడు వెలువ‌డిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి అనూహ్యంగా 242 ఓట్లు  ప‌డ్డాయి. కాంగ్రెస్ బ‌లానికి మించి ఓట్లు రావ‌డంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఆ పార్టీ నాయ‌కులు దీనిపై పార్టీ వ్య‌వ‌హార‌ల్లో చ‌ర్చిస్తామ‌ని కూడా చెబుతున్నారు.

Also Read: coronavirus | దేశంలో భారీగా త‌గ్గిన కోవిడ్-19 కేసులు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నంటే? 

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌స్తుత ఫ‌లితాల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మ‌ధు విజయం సాధించిన సంగత తెలిసిందే. ఆయ‌న‌కు మొత్తం 480 ఓట్లు వ‌చ్చాయి.  కాంగ్రెస్ అభ్యర్థికి 242 ఓట్లు ప‌డ్డాయి.  ప్రత్యర్థిపై తాతా మ‌ధు 238 ఓట్ల మెజార్టీతో  విజ‌యం సాధిచారు. మొత్తం వేసిన ఓట్ల‌లో 12 చెల్ల‌ని ఓట్లు ఉండ‌గా, స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్క‌డ టీఆర్ఎస్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ..  ఈ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంపై గులాబీ  నేత‌లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ద‌ని తెలుస్తోంది.  ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం  ప్ర‌స్తుతం రాష్ట్రలో  హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తం ఓట్ల‌ల్లో దాదాపు 140 ఓట్లు కాంగ్రెస్‌కు క్రాస్‌ అయ్యాయి. దీనిపై తాతామ‌ధు స్పందిస్తూ.. క్రాస్ ఓటింగ్ విష‌యాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తాన‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా దీనిపై పార్టీలో చ‌ర్చిస్తామంటూ ఆయ‌న వెల్ల‌డించారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన నేత‌ల‌ను గుర్తించారా?   వారు ఎవ‌ర‌ని భావిస్తున్నారు? అని అడ‌గ్గా దానిపై కామెంట్ చేయ‌డానికి నిరాక‌రించారు.అయితే, భ‌విష్య‌త్తులో దీనిపై చ‌ర్చ ఉంటుద‌న్నారు. 

Also Read: Omicron Variant | దేశంలో 41 ఒమిక్రాన్ కేసులు.. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోకుంటే విప‌త్తే..

మొద‌టి నుంచి కాంగ్రెస్ త‌న‌కు ఓట్ల‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఓట్ల‌ను క్రాస్ చేయ‌డంలో కొంత‌మేర త‌మ‌కు అనుకూల ఫ‌లితాన్ని రాబ‌ట్టింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ  ఎన్నికల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యూహం పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండ‌గా, మెద‌క్ లో   కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జ‌గ్గారెడ్డి గతంలో సవాల్ చేశారు. ప్ర‌స్తుత ఫ‌లితాల్లో  కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios