పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో అల్లర్లకు పాల్పడిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్లీన్ చీట్ ఇస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మమత హయాంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని ఆమె అన్నారు.
హౌరాలో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. హౌరాలో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రాళ్లు రువ్వారని వారికి మమతా బెనర్జీ క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘‘హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా రాళ్లదాడి జరిగింది. మమతా బందోపాధ్యాయ (బెనర్జీ) న్యాయం చేయడానికి బదులుగా.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రామనవమి శోభా యాత్రపై దాడి చేసిన రాళ్లదాడిదారులకు క్లీన్ చిట్ ఇచ్చారు’’ అని అన్నారు. హిందూ సమాజంపై మమత ఇంకెంత కాలం దాడి చేస్తారని ఆమె ప్రశ్నించారు.
సంజయ్ రౌత్ కు బెదిరింపు.. ఏకే - 47తో కాల్చి చంపుతానని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి మెసేజ్
మమత హయాంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ‘‘ అంతకు ముందు 2022లో లక్ష్మీపూజ సందర్భంగా దళితులు పూజలు చేస్తుండగా వారిపై దాడి జరిగింది. ఆ సమయంలో కూడా ఆమె నిశ్శబ్దంగా ఉంది.’’ అని ఆమె అన్నారు.
కాగా.. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా హౌరాలో గురువారం తెల్లవారుజామున హౌరాలో రెండు ఘర్షణ పడ్డాయి. ఊరేగింపు సందర్భంగా దుండగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఈ హింసాకాండ దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ)కి అప్పగించింది. సీఐడీ ఇన్ స్పెక్టర్ జనరల్ సునీల్ చౌదరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది.
రికార్డు స్థాయికి ఎగుమతులు.. రక్షణ రంగ సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి : ప్రధాని మోడీ
అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ తో మాట్లాడి హౌరాలో హింస చెలరేగిన పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ హింసపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు జరపాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అలాగే ఈ అల్లర్లపై కోల్ కతా హైకోర్టులో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి శుక్రవారం పిల్ దాఖలు చేశారు.
కోయంబత్తూర్ లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా షర్మిల.. (వీడియో)
ఇదిలా ఉండగా.. హౌరాలో జరిగిన హింసాకాండ వెనక బీజేపీ హస్తం ఉందని శుక్రవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆరోపించారు. ఈ అల్లర్లలో ఆస్తులు కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ ప్రాంతంలో శాంతిని కాపాడాలని మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘హౌరా ఘటన చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న హింసాకాండ వెనుక హిందువులు, ముస్లింలు లేరు. బీజేపీతో పాటు భజరంగ్ దళ్, ఇతర సంస్థలు ఆయుధాలతో హింసకు పాల్పడుతున్నాయి’’ అని మమతా బెనర్జీ ‘ఏబీపీ ఆనంద’తో అన్నారు. హౌరాలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 31 మందిని అరెస్టు చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు.
