New Delhi: శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ‌ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.15,920 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశానికి చెప్పుకోదగ్గ విజయమని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ పై స్పందించిన ప్ర‌ధాని మోడీ రక్షణ రంగ సంస్కరణలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు.

Defence sector reforms - PM Modi: దేశంలో ర‌క్ష‌ణ రంగ ఎగుమ‌తులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ‌ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.15,920 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశానికి చెప్పుకోదగ్గ విజయమని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ పై స్పందించిన ప్ర‌ధాని మోడీ రక్షణ రంగ సంస్కరణలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు.

Scroll to load tweet…

రక్షణ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఇది తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ ను డిఫెన్స్ ప్రొడక్షన్ హబ్ గా మార్చే ప్రయత్నాలకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.15,920 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ట్వీట్ పై ప్రధాని స్పందించారు. ఇది దేశానికి చెప్పుకోదగ్గ విజయమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 

ప్ర‌ధాని మోడీ త‌న ట్వీట్ లో.. "అద్భుతం. 'మేక్ ఇన్ ఇండియా' పట్ల భారతదేశ ప్రతిభకు, ఉత్సాహానికి ఇది నిదర్శనం. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా ఇది తెలియజేస్తోంది. భారత్ ను డిఫెన్స్ ప్రొడక్షన్ హబ్ గా మార్చే ప్రయత్నాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

Scroll to load tweet…