గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఢిల్లీలో ఏకే 47తో చంపేస్తానని మెసేజ్ వచ్చిందని తెలిపారు. 

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. రౌత్ మొబైల్ కు వాట్సప్ ద్వారా ఈ సందేశం వచ్చినట్టు తెలుస్తోందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. శివసేన నేతను ఢిల్లీలో ఏకే-47 రైఫిల్ తో కాల్చి చంపుతారని ఆ మెసేజ్ లో ఉంది. 

రికార్డు స్థాయికి ఎగుమ‌తులు.. రక్షణ రంగ సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి : ప్ర‌ధాని మోడీ

ఈ మెసేజ్ ను గమనించిన రౌత్ ముంబై పోలీస్ కమిషనర్ కు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా రౌత్ వివరించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను అంతమొందిస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం కృష్ణ జింకను చంపడం ద్వారా బిష్ణోయ్ కమ్యూనిటీని అవమానించినందుకు 2022 మార్చిలో సల్మాన్ ఖాన్ కార్యాలయానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

లారెన్స్ బిష్ణోయ్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ముంబైలోని తన కార్యాలయంలో నటుడు సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఈ-మెయిల్ రావడంతో గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ లతో పాటు మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కోయంబత్తూర్ లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా షర్మిల.. (వీడియో)

‘‘గోల్డీ భాయ్ (గోల్డీ బ్రార్) సల్మాన్ ఖాన్ తో ఫేస్ టు ఫేస్ గా మట్లాడాలని అనుకుంటున్నాడు. ’’ అని హిందీలో రాసిన మెయిల్ వచ్చింది.దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో క్రిమినల్ బెదిరింపు, సాధారణ ప్రయోజన ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మెయిల్ పంపించిన నిందితులపై ఐపీసీ 506(2), 120(బీ), 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నిందితులుగా ఉన్నారు.

తండ్రి కోసం చొక్కా కుట్టిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

కాగా.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. నటుడి తండ్రి సలీం ఖాన్ రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లే బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో గతేడాది జూన్ లో ఓ బెదిరింపు లేఖ దొరికింది. అందులో గత ఏడాది మే 29న గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన గాయకుడు సిద్ధు మూస్ వాలాకు పట్టిన గతే సల్మాన్ కు పడుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. మళ్లీ తాజాగా ఈ బెదిరింపు రావడంతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.