Asianet News TeluguAsianet News Telugu

కోయంబత్తూర్ లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా షర్మిల.. (వీడియో)

కోయంబత్తూర్ లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా ప్రశంసలు అందుకుంటోంది షర్మిల. చిన్న వయసులోనే ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తోంది. 

Sharmila is the first young woman bus driver in Coimbatore - bsb
Author
First Published Apr 1, 2023, 12:01 PM IST

కోయంబత్తూర్ : షర్మిల.. ఇప్పుడు తమిళనాడులో అందరూ అబ్బురపడే పేరు. ఎందుకంటే ఆమె  కోయంబత్తూరులోని గాంధీపురం-సోమనూరు మధ్య ప్రైవేట్ బస్సు నడుపుతూ మొదటి మహిళా డ్రైవర్ గా గుర్తింపుపొందింది. ఏ విషయంలోనూ స్త్రీలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని మరోసారి నిరూపించింది. ఆమెను చూసిన తరువాత బస్‌స్టాప్‌ నుంచి బయటకు వెళ్లే వారంతా ఒక నిమిషం ఆగి..  షర్మిలకు షెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గాంధీపురం బస్టాండ్ వద్ద కూడా షర్మిలతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడతారు.

ఆటోడ్రైవర్ అయిన తండ్రి మహేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడిపింది. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంది. ఆ తరువాత బస్సు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశ పడింది. దీనికి తడ్రి కూతురికి అండగా నిలిచాడు. ఆ తర్వాత బస్సు డ్రైవర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న షర్మిల.. భారీ వాహనాలు నడపడానికి అధికారిక శిక్షణతో పాటు లైసెన్స్ కూడా పొందింది. భారీ వాహనాల డ్రైవింగ్‌లో పురుషాధిక్య రంగంలో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు షర్మిల చెప్పారు.

నేడు జైలు నుంచి విడుదల కానున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. భావోద్వేగ ట్వీట్ చేసిన భార్య నవజ్యోత్ కౌర్

7వ తరగతి చదువుతున్నప్పుడే డ్రైవింగ్‌పై ఆసక్తి పెరిగిందని షర్మిల చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బస్సు నడపడం మొదలుపెట్టింది. అయితే 2019 నుంచి కోయంబత్తూరులో ఆటో నడుపుతున్నానని.. హెవీ వెహికల్ లైసెన్స్ రావడానికి తన తండ్రే కారణమని చెబుతున్న షర్మిల.. ‘నువ్వు అనుకుంటే తప్పకుండా సాధిస్తావ్..’ అంటూ ఆమెను ప్రోత్సహించాడు. కోయంబత్తూర్‌లో నా కూతురు మొదటి మహిళా బస్సు డ్రైవర్ అని నేను గర్వంగా చెబుతాను" అంటారాయన.

నేర్చుకునే క్రమంలో ప్రాక్టీస్‌కి వెళ్లగానే ఆమె నడిపై బస్సు వైపు నవ్వుతూ చూసిన వారంతా నేడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా ఓ ప్రైవేట్ సంస్థ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రంగంలోకి దిగింది షర్మిల. 

Follow Us:
Download App:
  • android
  • ios