మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానాన్ని, స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకనాథ్ షిండేను గవర్నర్ ఆహ్వానించడంతో పాటు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.
దోమ కాటుతో ట్రైనీ పైలెట్ మృతి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి..
మెజారిటీ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం మెజారిటీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నందున తమదే నిజమైన శివసేన అని చెపుతోంది. కాగా తిరుగుబాటు నాయకులు సేనలో ఇక లేరని, వారు తనను వెన్నుపోటు పొడిచారని ఠాక్రే వాదిస్తున్నారు.
ఇప్పటి వరకు తిరుగుబాటు వర్గం బలం 40 ఉండగా.. ఉద్దవ్ కు కేవలం 15 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. షిండే సీఎంపై తిరుగుబాటు చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన తరువాత గవర్నర్ బలపరీక్షకు ఆదేశించారు. కానీ బలపరీక్షకు ఠాక్రే నిరాకరించి సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ షిండేను ఆహ్వానించారు. ఇదే నిర్ణయాన్ని ఉద్ధవ్ శిబిరం ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తమ అభ్యర్థికి ఓటు వేయాలని రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిందని, అయితే వారు విప్ ను ధిక్కరించి మరో వైపు ఓటు వేశారన్న కారణంతో స్పీకర్ ఎన్నికను సవాలు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ శిబిరం ఇప్పటికే కోరింది.
ఉత్తరాఖండ్ లో నదిలో కొట్టుకుపోయిన కారు, 9మంది మృతి
ఇప్పుడు ఉద్ధవ్ థాకరే, ఏక్ నాథ్ షిండేలు ఇద్దరూ శివసేనను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మాజీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన డిస్కలిఫికేషన్ నోటీసును కూడా సుప్రీంకోర్టు జూలై 11వ తేదీన విచారణకు తీసుకోనుంది. ఉద్ధవ్ కోర్టులో తన పోరాటాన్ని సమర్థిస్తుండగా షిండే క్షేత్రస్థాయిలో మద్దతు మరింత మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. తన శిబిరంలోకి మరింత మంది నాయకులను లాగుతూ ఠాక్రే వర్గాన్ని మరింత బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే శివసేనకు చెందిన 66 మంది మాజీ కార్పొరేటర్లు గురువారం థానేలోని షిండే శిబిరంలో చేరారు. నవీ ముంబైలోని ముప్పై రెండు మంది కార్పొరేటర్లు కూడా షిండేకు మద్దతు పలికారు.
Indian Railway: 10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే శాఖ.. కారణం తెలిస్తే కన్నీరు ఆగదు..
మొదట షిండే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కానీ కొంత కాలం తరువాత మరొకరు చేరిపోయారు. కాగా అమరావతి నుంచి గతంలో ఎంపీగా పని చేసిన ఆనందరావు విఠోబా అడ్సుల్ శివ సేనకు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం లోక్ సభలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నారు. అయితే వారిలో ఇద్దరు కూడా షిండే వైపు మొగ్గు చూపారు. అద్సుల్ పార్టీకి రాజీనామా చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అతడు ఈడీకి భయపడ్డారని చెప్పారు. ‘‘ ఆనంద్ రావు తన రాజీనామాను ఇచ్చారు, ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వెళ్తోందని నాకు తెలిసింది. అతడి ఇంటిపై దాడులు జరిగాయి. ఇలాంటి ఒత్తిడి చాలా మందిపై జరుగుతోంది. ’’ అని సంజయ్ రౌత్ వార్తా సంస్థ ఏఎన్ఐతో గురువారం అన్నారు.
