మహారాష్ట్రలో ఒమిక్రాన్ విజృంభణ.. కొత్తగా 20 మందికి నిర్ధారణ, సెంచరీ దాటిన కేసులు
దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా (coronavirus) వేరియంట్ ఒమిక్రాన్ (omicron) భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో (maharashtra) దీని తీవ్రత అధికంగా వుంది. ఈ క్రమంలో శుక్రవారం కొత్తగా 20 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా (coronavirus) వేరియంట్ ఒమిక్రాన్ (omicron) భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో (maharashtra) దీని తీవ్రత అధికంగా వుంది. ఈ క్రమంలో శుక్రవారం కొత్తగా 20 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి అక్కడ ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 108కి చేరుకుంది.
కాగా.. శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో కలిపి నేటికి 358 మొత్తం ఒమిక్రాన్ కేసులు అయ్యాయని, 144 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health and family welfare) కార్యదర్శి రాజేష్ భూషణ్ (rajesh bhushan) తెలిపారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు.
Also Read:దేశంలో 358కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారిలో 89 శాతం మంది మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు. 61 శాతం మంది రెండవ డోస్ వేయించుకున్నారని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల్లో 183 మంది బాధితులు మహిళలు ఉన్నారని చెప్పారు. దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19, ఒమిక్రాన్ కేసులను ప్రధానమంత్రి, ఆరోగ్య మంత్రి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కరోనాను ఎదుర్కొవడానికి దేశం సంసిద్ధంగా ఉందని తెలిపారు. కరోనా వస్తే ఎదుర్కొవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో 18,10,083 ఐసోలేషన్ బెడ్స్, 4,94,314 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్ ఉన్నాయని తెలిపారు. 1,39,300 ఐసీయూ బెడ్స్, 24,057 పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్, 64,796 పీడియాట్రిక్ నాన్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయని తెలిపారు. దేశంలో పెరుగుతున్న బూస్టర్ డోస్ డిమాండ్ పై రాజేష్ భూషన్ స్పందించారు. బూస్టర్ డోసు ఎలా పని చేస్తుంది ? దాని వల్ల ఎదురయ్యే పర్యావసానాలు ఏంటనే విషయంలో శాస్త్రీయంగా అధ్యయనం జరుగుతోందని అన్నారు. ఆ శాస్త్రీయ అధ్యయనాల ఫలితాల ఆధారంగా బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.