‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

మహారాష్ట్ర రాజకీయం క్షణాల వ్యవధిలో ఊహించని మలుపు తిరుగింది. శివసేనకు మద్ధతు ఇచ్చినట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది

Maharashtra: Further discussion to take place tomorrow, says Congress

మహారాష్ట్ర రాజకీయం క్షణాల వ్యవధిలో ఊహించని మలుపు తిరుగింది. శివసేనకు మద్ధతు ఇచ్చినట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. శివసేనకు మద్ధతుపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read:మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా

మరోవైపు గవర్నర్ భగత్‌సింగ్‌తో శివసేన నేత ఆధిత్య థాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత, సంఖ్యా బలం తదితర విషయాలను ఆదిత్య.. గవర్నర్‌కు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజులు గడువు కోరామని కానీ గవర్నర్ తిరస్కరించారని ఆదిత్య తెలిపారు.

కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో చర్చలు జరిపామని, తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేనకు బయటినుంచి మద్ధతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Also Read:మహారాష్ట్ర: శివసేనకు బయటి నుంచే కాంగ్రెస్ మద్ధతు

ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో శివసేనకు బయటి నుంచి మద్ధతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేతలతో భేటీ జరుగుతున్నట్లుగానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. సోనియా గాంధీతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అన్ని అంశాలను చర్చించిన మీదట మిగిలిన సమాచారం తెలియజేస్తామని ఉద్ధవ్‌కు సోనియా తెలిపారు. మొత్తం మీద వైరి పక్షాలుగా ఉన్న శివసేన, కాంగ్రెస్ కలిసి పనిచేయబోతుండటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

అతిత్వరలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్‌తో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకున్న బలాన్ని, సంసిద్ధతను ఉద్ధవ్ గవర్నర్‌కు తెలిపే అవకాశాలున్నాయి.

Also Read:కాంగ్రెస్ తో శివసేన: ఈ నాటి ఈ 'మహా' బంధమేనాటిదో...

ప్రస్తుతానికి ఎన్సీపీ, శివసేన ప్రభుత్వంలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ విషయంపైనా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని మాత్రం గట్టిగా కోరుతోంది.

మంత్రి పదవుల విషయానికి వస్తే 16 శివసేనకు, 14 ఎన్సీపీకి, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి శరద్‌ పవార్ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios