మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో విమానంలోని ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
Maharashtra Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురయ్యింది. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలొ అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు కూడా మరణించినట్లు ANI వెల్లడించింది.
బారామతిలో విమాన ప్రమాదం
ఎన్సిపి నేత అజిత్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగే కార్యక్రమాల్లో విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలో గోజుబావి ప్రాంతంలో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలిన ఈ ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే అజిత్ పవార్ సహా ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, మరో ఇద్దరు విమాన సిబ్బంది మరణించారు.
ప్రమాదానికి కారణమేంటి..?
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం సాంకేతిక కారణాలతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ముంబై నుండి బయలుదేరిన విమానం గమ్యస్థానానికి చేరుకుని ల్యాండ్ అయ్యే క్రమంలోనే ఎక్కడో లోపం జరిగి ఉంటుందని... అందువల్లే క్రాష్ ల్యాండ్ అయినట్లు సమాచారం. విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో రెండు ముక్కలయ్యింది... ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా అందరూ మరణించినట్లు డిజిసిఏ (DGCA) వెల్లడించింది.


