ఫడ్నవీస్ vs షిండే vs అజిత్ పవార్: వీరిలో రిచ్చెస్ట్ నాయకుడెవరో తెలుసా?
దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు కలిసి కొత్తగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురిలో ఎవరు రిచ్చెస్ట్ నాయకుడో తెలుసుకుందాం.
ఫడ్నవీస్, షిండే, పవార్ ప్రమాణ స్వీకారం
ఎట్టకేలకు మహారాష్ట్రలో మహాయతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురి ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Devendra Fadnavis
దేవేంద్ర ఫడ్నవీస్ నికర సంపద
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పడ్నవిస్ రూ.4.68 కోట్ల స్థిరాస్తులు, రూ.56.07 లక్షల చరాస్తులు కలిగివున్నారు. అంటే మొత్తం విలువు రూ.5.25 కోట్లు. ఇందులో నగదు, బ్యాంకు బ్యాలెన్స్, పోస్టల్ సేవింగ్స్, బంగారం, భీమా పాలసీలు ఉన్నాయి.
Devendra Fadnavis
ఫడ్నవీస్ పేరు మీద షేర్లు, బాండ్లు లేవు. ఆయనకు నాగ్‌పూర్‌లో ఇల్లు, చంద్రపూర్‌లో వ్యవసాయ భూములు ఉన్నాయి. రూ.23,500 నగదు, రూ.20.70 లక్షల విలువైన భీమా పాలసీలు, రూ.2.28 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.32.85 లక్షల విలువైన 450 గ్రాముల బంగారం ఉన్నాయి.
Eknath Shinde
ఏక్‌నాథ్ షిండే నికర సంపద
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ.14.83 కోట్ల నికర సంపదను ప్రకటించారు. 2019లో రూ.5.44 కోట్లు. రూ.2,600 నగదు, రూ.10.76 లక్షల ఎఫ్డిలు, రూ.50,500 టీజేఎస్బీ షేర్లు, రూ.59.87 లక్షల LIC భీమా, రూ.7.92 లక్షల విలువైన 110 గ్రా. బంగారం, రూ.2.25 లక్షల విలువైన తుపాకీ, రూ.2.50 లక్షల రివాల్వర్, రెండు కార్లు ఉన్నాయని అఫిడవిట్ లో ప్రకటించారు.
Ajith Pawar
అజిత్ పవార్ నికర సంపద
అజిత్ పవార్ రూ.8.22 కోట్ల చరాస్తులు, రూ.37.15 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ట్రాక్టర్, రెండు కార్లు, వెండి వస్తువులు, ఎప్డీలు, షేర్లు, బాండ్లు ఉన్నాయి.