Madhya Pradesh Assembly Election Results 2023: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బీజేపీ 120 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 107 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇత‌రులు రెండు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. 

Madhya Pradesh Election Results 2023: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2023 ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ బీజేపీల మ‌ధ్య హోరాహోరీ పోరు కొన‌సాగుతోంది. రెండు పార్టీలు వంద‌కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం బీజేపీ 120 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 107 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇత‌రులు రెండు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.

బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని మ‌రికొన్ని అంచ‌నాలున్నాయి. అయితే, ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న ట్రెండ్స్ లో ఇరు పార్టీల మ‌ధ్య 10 స్థానాలు మాత్ర‌మే లీడ్ తేడా క‌నిపిస్తోంది. అయితే, బీజేపీ ఇదే జోరు కొన‌సాగిస్తే అధికారం ద‌క్కించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్