Asianet News TeluguAsianet News Telugu

Lumpy skin disease: 57 వేల ప‌శువులు మృతి.. లంపి స్కిన్ డిసీజ్ పై రాష్ట్రాల‌ను హెచ్చ‌రించిన కేంద్రం

Lumpy skin disease: ఇప్ప‌టివ‌ర‌కు లంపి స్కీన్ డిసీజ్ కు ఖ‌చ్చిత‌మైన మందు లేదు. కానీ వ్యాధి సోకిన జంతువులను వేరుచేస్తూ.. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేత్ర స్థాయిలో ప్రయత్నాలు చేయాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. వైద్య అధికారుల ముందస్తు సూచనలు పాటించాలని పేర్కొంది.
 

Lumpy skin disease: 57 thousand cattle died.. Center warned states about Lumpy skin disease
Author
First Published Sep 10, 2022, 5:13 PM IST

Lumpy skin disease: లంపి స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డీ) కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 57,000 పశువులు చనిపోయాయనీ, ఇది పశువులను ప్రభావితం చేసే వైరల్ ఇన్‌ఫెక్షన్, అత్యంత దారుణంగా అటాక్ చేసే అంటువ్యాధి అని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 15.21 లక్షల పశువులకు ఈ చ‌ర్మ‌ వ్యాధి సోకింది. గుజరాత్, రాజస్థాన్ , పంజాబ్ , ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో సహా కనీసం ఏడు రాష్ట్రాల్లో ప‌శువుల్లో ఈ కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. ఇంకా ఇత‌ర ప్రాంతాల‌కు సోకే అవ‌కాశ‌ముంద‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీతో అనేక రాష్ట్రాలు ప‌శువుల ర‌వాణాపై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అయితే, పెద్ద సంఖ్య‌లో ప‌శువుల ప్రాణాలు తీస్తున్న ఈ లంపి స్కీన్ డిసీజ్.. మ‌నుషులకు సోకితే ప‌రిస్థితి ఏంట‌నే దానిపై ఆందోళ‌న‌లు సైతం పెరుగుతున్నాయి. 

ఇప్ప‌టివ‌ర‌కు లంపి స్కీన్ డిసీజ్ కు ఖ‌చ్చిత‌మైన మందు లేదు. కానీ వ్యాధి సోకిన జంతువులను వేరుచేస్తూ.. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేత్ర స్థాయిలో ప్రయత్నాలు చేయాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. వైద్య అధికారుల ముందస్తు సూచనలు పాటించాలని పేర్కొంది. రాజస్థాన్, గుజరాత్‌లలో సంక్రమణ వేగంగా వ్యాప్తి చెందుతోంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన నివారణ వ్యూహాలను పర్యవేక్షించడానికి జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ఒక్క ఆగస్ట్‌లోనే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ  వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా 3,000 పశువులు చనిపోయాయి.  వేలాది ప‌శువులు ఈ చ‌ర్మ వ్యాధి బారిన‌ప‌డ్డాయి. లంపి స్కీన్ డిజీస్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. గుజరాత్ ప్రభావితమైన 14 జిల్లాల్లో పశువుల రవాణాను నిషేధించింది.

ఎంటీ లంపి స్కీన్ డిసీజ్..? 

యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ప్రకారం.. లంపి చర్మ వ్యాధి అనేది పశువులను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ఈగలు, దోమలు లేదా పేలు వంటి రక్తాన్ని తినే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఎల్‌ఎస్‌డీ లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ (ఎల్‌ఎస్‌డివి) వల్ల వస్తుంది. ఇది పోక్స్‌విరిడే కుటుంబానికి చెందిన వైరస్. కాప్రిపాక్స్ వైరస్ జాతికి చెందినది అని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) తెలిపింది.

ఎలా వ్యాపిస్తుంది?

లంపి స్కీన్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. WOAH ప్రకారం, ఆర్థ్రోపోడ్ వెక్టర్స్ ద్వారా ప్రధాన ప్రసార సాధనాలుగా ఉంటాయి. సోకిన జంతువుతో ప్రత్యక్ష సంబంధం వైరస్ ప్రసారంలో చిన్న పాత్ర పోషిస్తుంది. ఫోమైట్‌ల ద్వారా ప్రసారం జరుగుతుంద‌ని కూడా స‌మాచారం. ఉదాహరణకు ఈ వ్యాధి సోకిన లాలాజలంతో కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం, ఇత‌ర ప‌శువులు కూడా వాటితో ద‌గ్గ‌ర ప‌రిస‌రాల్లో ఉండ‌టం వ‌ల్ల ఈ వ్యాపిస్తోంది. జంతువుల నుండి జంతువులకు వ్యాప్తి చెందే పరంగా, ఒక జంతువు సంక్రమణ నుండి కోలుకున్న తర్వాత, అది బాగా రక్షించబడుతుంది. ఇతర జంతువులకు సంక్రమణకు మూలం కాదు. క్లినికల్ సంకేతాలను చూపించని వ్యాధి సోకిన జంతువులలో, వైరస్ కొన్ని వారాల పాటు రక్తంలో ఉండి, చివరికి అదృశ్యమవుతుంది.

లంపి స్కీన్ డిసీజ్ లక్షణాలు ఏమిటి?

లంపి చర్మ వ్యాధి జ్వరం, చర్మంపై నోడ్యూల్స్, కళ్ళు, ముక్కు నుండి స్రావాలు, పాలు ఉత్పత్తి తగ్గడం, ఆహారం తీసుకోవడంలో ప‌శువుల‌కు ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం కావచ్చు.  ముఖ్యంగా గతంలో వైరస్ బారిన పడని జంతువులలో ప్ర‌భావం అధికంగా ఉంటుంది. అలాగే, గర్భిణీ ఆవులు, గేదెలు తరచుగా వ్యాధి కారణంగా గర్భస్రావం చెందుతాయి.

మానవులకు ప్రమాదం ఉందా?

లంపి స్కీన్ డిసీజ్ ప‌శువుల‌ను నుంచి మ‌నుషుల‌కు సోకితే ప‌రిస్థితి ఎంట‌నే దానిపై ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. అయితే, ఇది మ‌నుషుల‌కు సోకే అవ‌కాశం లేదు. WOAH ప్రకారం, జూనోటిక్ కాదు, అంటే ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపించదు. మానవులు వైరల్ సంక్రమణకు గురికాలేరు.  దేశంలో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కు ముందు అంటే 2020 సెప్టెంబ‌ర్ లో మహారాష్ట్రలో ఈ  వైరస్ కార‌కాన్ని గుర్తించారు. గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో కూడా కేసులు నమోదయ్యాయి.. కానీ అవి ప్రస్తుతం చూసినంత వేగంతో వ్యాపించలేదు. ప్ర‌స్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప‌శువుల్లో ఈ చ‌ర్మ వ్యాధి వ్యాప్తి పెరుగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios