ముంబై: మహారాష్ట్ర లో శివసేన,ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే నేటి సాయంత్రం 6గంటల 40 నిముషాలకు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

మొత్తంగా 7గురు సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మరో 6గురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన నుండి ఎకనాథ్ షిండే, సుభాష్ దేశాయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also read: ఉద్ధవ్ ప్రమాణానికి మోడీకి ఆహ్వానం... ఆసక్తికరంగా గెస్ట్ లిస్ట్ 

ఎన్సీపీ నుండి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బాలాసాహెబ్ తొరాట్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైనట్టు సమాచారం. పృథ్వీ రాజ్ చవాన్ స్పీకర్ పదవి చేపట్టనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఒకవేళ ప్రిథ్వీరాజ్ చవాన్ స్పీకర్ పదవిని చేపడితే ఆయన ప్రమాణస్వీకారం చేయకపోవచ్చు. లేదు కాబినెట్ బెర్త్ తీసుకుంటే మాత్రం పృథ్వీ రాజ్ చవాన్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. మొత్తానికి బాలాసాహెబ్ థోరాట్ ప్రమాణస్వీకారం చేయడం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. 

ఇక పదవుల పంపకానికి వస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఉంటుందని అది ఎన్సీపీకే ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం 6.40 గంటలకు శివాజీ పార్క్ లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ప్రతీ పార్టీ నుంచి ఒక్కరూ లేదా ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలపారు. 

గవర్నర్ తో కాబోయే సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ: ప్రమాణ స్వీకారానికి వేదిక అదే

పదవుల పంపకాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ప్రపుల్ పాటిల్ తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 3 తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రపుల్ పాటిల్ తెలిపారు. ఈ భేటీలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు.  

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, ఆర్ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలను సైతం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్‌ నేత విజయ్‌ వాడెట్టివర్‌ తెలిపారు. 

కాంగ్రెస్‌తో స్నేహామా: శివసేనతో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత

ప్రమాణ స్వీకారానికి ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను ఆహ్వానిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహావికాస్ అఘాది కూటమికి చెందిన అన్ని పార్టీల నేతలు హాజరు కావాలని ఇప్పటికే కూటమి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.