ఉద్ధవ్ ప్రమాణానికి మోడీకి ఆహ్వానం... ఆసక్తికరంగా గెస్ట్ లిస్ట్
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6గంటల 40నిముషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6గంటల 40నిముషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయన హాజరవుతున్నట్లు తెలియవస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని స్టాలిన్ పార్టీ డీఎంకే 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసింది. డీఎంకే కూటమి తమిళనాడులోని 39 స్థానాల్లో ఒక్క తేని స్థానం మినహా మిగిలిన 38 సీట్లలో గెలిచి విజయ ఢంకా మోగించింది.
Also read: ఠాక్రే కుటుంబ తొలి ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ చాలా ఆసక్తికరం...
ఇకపోతే, ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా స్టాలిన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. కరుణానిధి తరువాత పార్టీ పగ్గాలను చేపట్టిన స్టాలిన్ పార్టీకి అనేక విజయాలను అందించాడు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపును నిరసిస్తూ డీఎంకే లోక్ సభ నుంచి వాక్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, రానున్న ఎన్నికల్లో రూపుదిద్దుకునే యూపీఏ కూటమికి చిహ్నంగా కూడా స్టాలిన్ రాక మనకు ఇక్కడ కనపడుతుంది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నిన్న ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే స్వయంగా వెళ్లి ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
అయితే.. వీరిలో ఎవరు వస్తున్నారన్న విషయంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీకి కూడా ఫోన్ చేసి ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించినట్టు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేసారు.
కాగా ఈ ప్రమాణస్వీకారానికి అతిరథ మహారథులు, వేలాదిమంది పార్టీ కార్యకర్తలు తరలి రానందున ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. దాదాపు 30 ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తున్నారు.
స్వతంత్ర వీర్ సావార్కర్ రోడ్డు, కేలుస్కార్ రోడ్డు, దాదర్ ఎంబీ రౌత్ మార్గ్, దాదర్ పాండురంగ్ నాయక్ మార్గ్, దాదర్ దాదాసాహెబ్ రేగే మార్గ్, దాదర్ ఎల్‌టీ, దిలీప్ గుప్తే మార్గ్, ఎన్‌సీ కేల్కర్ మార్గ్, దాదర్ కీర్తి కాలేజ్ లేన్, కృష్ణనాథ్ ధురు రోడ్, పి బాలు మార్గ్, ప్రభాదేవి ఆదర్శ్ నగర్, వోర్లి కోలివాడ ఆర్ఏకే 4 రోడ్డు, ఫైవ్ గార్డెన్స్ సేనాపతి బపట్ మార్గ్, రనడే రోడ్డు, పీఎన్ కొట్నీస్ రోడ్డు, శివాజీ పార్క్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నేటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు అమల్లో ఉంటాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also read: మహా రాజకీయం..శివసేన భవన్‌పై బాల్‌థాకరే, ఇందిరాగాంధీల పోస్టర్
కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమ వేదికైన శివాజీ పార్క్ ఏరియాలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్క్ గ్రౌండ్స్‌తో పాటు సమీప ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శివాజీ పార్కు తో ఠాక్రే కుటుంబానికి విడదీయరాని బంధముంది. స్వర్గీయ బాల్ ఠాక్రే ఇక్కడి నుండే తన దసరా రాలీలను నిర్వహించేవాడు. దీనిని శివసేన కార్యకర్తలు ముద్దుగా శివతీర్థ అని పిలుచుకుంటారు.