కాంగ్రెస్‌తో స్నేహామా: శివసేనతో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న నేత

పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా శివసేన... కాంగ్రెస్‌తో కలవడాన్ని వ్యతిరేకిస్తూ రమేశ్ సోలంకీ అనే సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ShivSena senior Leader Quits Over Tie-Up With Congress

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటం స్వపక్షంలోనే భేదాభిప్రాయలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా శివసేన... కాంగ్రెస్‌తో కలవడాన్ని వ్యతిరేకిస్తూ రమేశ్ సోలంకీ అనే సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు.

తన జీవితంలోనే అత్యంత భారమైన హృదయంతో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నానని ఆయన ట్వీట్ చేశారు. శివ సైనికుడు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటం అభినందనీయమని... కానీ కాంగ్రెస్‌ పార్టీతో శివసేన స్నేహం చేయడం అన్న విషయాన్ని తన అంతరాత్మ అంగీకరించడం లేదని సోలంకీ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also read:అన్నాచెల్లిలి అనుబంధం: అజిత్ పవార్‌ను హత్తుకున్న సుప్రియా సూలే

సేనతో కలిసి ఇక పనిచేయాలని భావించడం లేదని... తనకు ఇన్నాళ్లు సహకరించిన పార్టీకి, కార్యకర్తలకు, ఇతర నేతలకు ధన్యవాదాలు అని రమేశ్ సోలంకీ పేర్కొన్నాడు. అయితే తన జీవితాంతం బాలాసాహెబ్ శివసైనికునిగా మాత్రం ఉంటానని రమేశ్ తెలిపాడు.

శివసేనలో సుమారు 20 ఏళ్లకు పైగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రమేశ్.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకే చోటుకు చేరడాన్ని తట్టుకోలేకపోయాడు. కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ సైట్‌ను సెన్సార్ చేయాలని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచారు.

కాగా మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బుధవారం సాయంత్రం ముంబై ట్రైడెంట్ హోటల్‌లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

కూటమి నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. భారీ సంఖ్యలో విచ్చేసిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోటల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది.

కాగా డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండున్నరేళ్లు పంచుకోనున్నాయి. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు.

Also Read:మహా సీఎంగా ఉద్ధవ్: డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరే?

సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ బలపరీక్షను నిర్వహిస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 5 గంటల్లోపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios