Asianet News TeluguAsianet News Telugu

ఇట్ల కూడా అడుగుతరా ? ఇంటి కిరాయికి ఇంటర్ మార్కులకు లింక్.. 76 శాతమే వచ్చాయని గది ఇవ్వని ఓనర్.. చాట్ వైరల్

బెంగళూరు సిటీలో ఇంటి కిరాయి కోసం ప్రయత్నించి విఫలమైన ఓ యువకుడి వాట్సప్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 76 శాతం మాత్రమే మార్కులు వచ్చాయని ఇంటి ఓనర్ అతడికి గది ఇవ్వలేదు. దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. 

Link to inter marks for house rent.. Owner who did not give room said only 76 percent.. Chat viral..ISR
Author
First Published Apr 30, 2023, 3:00 PM IST

జీవితంలో గొప్పగా స్థిరపడాలి, మంచి జాబ్ రావాలంటే చదువు కావాలి అంటారు. అది కూడా మామూలుగా కాదు.. టాప్ లో ఉండాలి అని చిన్నప్పటి నుంచి టీచర్లు, పెద్దలు చెబుతూ ఉంటారు. అవి వింటూనే అందరం పెరిగాం. కానీ ఇళ్లు అద్దెకు కావాలంటే కూడా మంచి మార్కులు రావాలని ఎక్కడైనా చెప్పారా ? లేదు కదా.. ఇంతకు ముందైతే అవసరం లేదేమో కానీ ఇప్పుడు కావాలి. ఏంటి నమ్మడం లేదా ? బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ట్వీట్ చూస్తే మీరు కచ్చితంగా నమ్ముతారు. 

కర్ణాటకలో ఈసారి బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పని చేయదు.. కాంగ్రెస్ దే అధికారం - మాజీ మంత్రి ఎంబీ పాటిల్

బెంగళూరు.. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి. దీంతో అందులో పని చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లందరూ బెంగళూరులో నివసిస్తారు. దీంతో ఆటోమెటిక్ గా ఇక్కడి ఇళ్లకు యమ డిమాండ్ ఉంటుంది. ఈ సిటీలో కొన్ని సార్లు ఎంత రెంట్ కట్టినా కూడా ఇళ్లు దొరకని పరిస్థితి నెలకొంటుంది. దీంతో చాలా మంది హౌస్ బ్రోకర్లను సంప్రదిస్తారు. కొన్ని సార్లు వారి ద్వారా కూడా ఇంటిని పొందడం సాధ్యం కాకపోవచ్చు. ఇలానే ఇల్లు అద్దెకు ఇప్పిస్తానని చెప్పి, అనేక వివరాలు అడిగి చివరికి చేతులు ఎత్తేయడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిరాశకు గురయ్యారు. అసలు ఇళ్లు దక్కకపోవడానికి కారణం ఏంటో తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా హౌస్ బ్రోకర్, ఆ యువకుడికి జరిగిన మధ్య వాట్సప్ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పోలీసులు వెంబడిస్తున్నారని భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి.. ఎక్కడ జరిగిందంటే ?

యోగేష్ అనే యువకుడు బెంగళూరులో ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావించాడు. సొంతంగా ప్రయత్నించినా ఇళ్లు దొరక్కపోవడంతో ఓ హౌస్ బ్రోకర్ ను సంప్రదించాడు. ఆయన ఇంటి ఓనర్ ను సంప్రదించాడు. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని, కానీ అద్దెకు ఉండే వ్యక్తి లింక్డ్ ఇన్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్ ఇవ్వాలని ఓనర్ కోరారు. దీంతో పాటు టెన్త్ క్లాస్, ఇంటర్ మార్కుల మెమో, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించాడు. దీంతో పాటు అతడి గురించి సొంతంగా 150-200 పదాల్లో రాసి పంపించాలని చెప్పారు. 

పాపం.. ఎలాగైనా ఇళ్లు పొందాలనే ఉద్దేశంతో అతడి చెప్పినవన్నీ యోగేష్ చేశాడు. కానీ ఇంటర్ లో 76 శాతం మార్కులు వచ్చాయని ఆ ఇంటి ఓనర్ ఇళ్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇదంతా హౌస్ బ్రోకర్, యోగేష్ కు మధ్య జరిగిన వాట్సప్ చాట్ లో స్పష్టమవుతోంది. ఈ చాట్ ను అతడి కజిన్ శుభ్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘ఇంటర్ మార్కులు మీ జీవితంలో ఎలా ఉపయోపడుతాయో లేదో తెలియదు. కానీ బెంగళూరులో ఇళ్లు అద్దెకు దొరకాలంటే మాత్రం కచ్చితంగా ఇంటర్ మార్కులు కావాలి’’ అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

పాకిస్థాన్ లో తెరపైకి వింత ఘటన.. తమ కూతుర్లపై లైంగిక దాడి జరగకూడదని సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

ఈ పోస్టును ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ల మంది చూశారు. 16 వేల మంది లైక్ చేశారు ఈ ట్వీట్ కు  నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. రాబోయే కాలంలో బెంగళూరులో ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే ప్రవేశ పరీక్ష ఏమైనా పెడుతారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1300 మంది ఈ ట్వీట్ కు కామెంట్లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios