Asianet News TeluguAsianet News Telugu

అన్యాయానికి వ్యతిరేకంగా మహాత్ముడిలాగే మేము కూడా భారత్ ను ఏకం చేస్తాం - రాహుల్ గాంధీ

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. ఆయన చూపిన బాటలో నడుస్తామని, దేశాన్ని ఏకం చేస్తామని చెప్పారు. 

Like the Mahatma, we will unite India against injustice - Rahul Gandhi
Author
First Published Oct 2, 2022, 11:32 AM IST

మహాత్మ గాంధీలాగే తాము కూడా భారత్ ను ఏకం చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. భారత్ జోడో యాత్ర లో భాగంగా పాద‌యాత్ర చేప‌డుతూ ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లో ఉన్నారు. దీంతో బదనవాలులోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయ‌న పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంధకారంలో పుదుచ్చేరి.. విద్యుత్‌ కోతలతో రోడ్లపైకి వచ్చిన జనం.. ప్రభుత్వంపై ఆగ్రహం..

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘‘ అన్యాయానికి వ్య‌తిరేకంగా గాంధీ దేశాన్ని ఏకం చేశారు. మేము కూడా అలాగే దేశాన్ని ఏకం చేస్తామ‌ని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని ఆయ‌న పేర్కొన్నారు. ‘‘ బాపు మాకు సత్యం, అహింస మార్గంలో నడవాలని నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని ఆయన వివరించారు’’ అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

'జుబాన్‌పేపై భారత్‌ జోడో' నినాదంతో, దృఢ సంకల్పంతో సంఘీభావ జ్యోతితో నేడు బాపు చూపిన బాటలో నడుస్తున్నామని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు సాగుతున్న భారత్ బోడో యాత్ర కు సంబంధించిన సంగ్రహావలోకనంతో పాటు మహాత్మా గాంధీ వీడియో మాంటేజ్‌ను కూడా షేర్ చేశారు. కాగా.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక చిహ్నం అయిన రాజ్‌ఘాట్ వ‌ద్ద పూలమాల‌లు వేసి నివాళి అర్పించారు.

మ‌హాత్మా గాంధీ, లాల్ బ‌హుదూర్ శాస్త్రికి ప్ర‌ధాని మోడీ నివాళులు..

స్వాతంత్ర సమరయోధుడు, ప్రజా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రికి కూడా కాంగ్రెస్ నివాళులర్పించింది. మాజీ ప్రధానికి నివాళి అర్పిస్తూ.. ‘‘ లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం మన జవాన్లు,  దేశానికి అంకితమైన రైతుల రక్తం, చెమట కోసం భారతీయులలో గర్వాన్ని నింపింది" అని పార్టీ పేర్కొంది.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా బీహార్ లో ప్రశాంత్ కిశోర్ భారీ పాద‌యాత్ర‌.. ఎన్ని వేల కిలో మీట‌ర్లంటే ?

అలాగే కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా  మహాత్మా గాంధీ, శాస్త్రి స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించారు. ‘‘ గాంధీజీ, శాస్త్రిజీలకు ఉమ్మడిగా ఉండే ఒక లక్షణం మనకు స్ఫూర్తినిచ్చే సంపూర్ణ సంకల్పం’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి బరిలో ఉన్న మరో అభ్యర్థి శశి థరూర్ గాంధీ జయంతి రోజున వార్ధాలోని సేవాగ్రామ్‌ను సందర్శించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios