Asianet News TeluguAsianet News Telugu

యాకూబ్ మెమ‌న్ స‌మాధిపై లైటింగ్ ఏర్పాటు.. చెల‌రేగిన రాజ‌కీయ దుమారం.. పోలీసుల విచారణ

ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమ‌న్ స‌మాధిని అలకరించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. శివసేన, బీజేపీల మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. 

Lighting arrangement on Yakub Memon's tomb.. Political scandal broke out.. Mumbai police started investigation
Author
First Published Sep 8, 2022, 4:11 PM IST

ఉగ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌ను ఉరితీసి ఏడేళ్లు అవుతోంది. అయితే దక్షిణ ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో ఆయ‌న స‌మాధిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అందంగా తీర్చిదిద్దారు. ఈ అంశం మ‌హారాష్ట్రలో అకస్మాత్తుగా రాజకీయ దుమారానికి దారి తీసింది. ఆ స‌మాధిపై మార్బుల్స్ (పాల‌రాతి), లైటింగ్ ను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై ముంబై పోలీసులు వెంట‌నే స్పందించారు. ఆ లైటింగ్ ను తొలగించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టారు. 

1993 ముంబై పేలుళ్ల కేసులో ఉగ్రవాది యాకూబ్ దోషి. 257 మంది అమాయకులను చంపిన ఉగ్రవాది. 2015లో, ఉరి వేయడానికి ఒక రోజు ముందు అర్థరాత్రి కొంతమంది ఉరిశిక్షకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. అయితే దానిని సుప్రీంకోర్టు అర్థరాత్రి విచారించి మరణశిక్షను సమర్థించింది. దీంతో అతడిని జూలై 30, 2015న నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో లో ఉగ్రవాది యాకూబ్ మెమన్ సమాధి ఉంది. ఒక మ‌ట్టి శ్మశాన స‌మాధిగా ఉన్న దానిని ఇటీవ‌ల ఎవ‌రో అలంక‌రించారు. మార్బుల్ వేసి, దాని చుట్టూ లైటింగ్స్ ఏర్పాటు చేశారు.

పళనిస్వామిని రీ ఎంట్రీ.. అన్నాడీఎంకే తాత్కాలిక బాస్‌గా పార్టీ ప‌గ్గాలు

అయితే ముంబై పోలీసులు గురువారం బడా కబ్రస్తాన్‌లో లైటింగ్ ఏర్పాట్లను ఆపివేశారు. కాగా.. అక్కడ పునరుద్ధరణకు అనుమతించారనే ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ, శివసేన మధ్య తీవ్రమైన రాజకీయ దుమారం రేగింది. మెమన్ సమాధిని పుణ్యక్షేత్రంగా మారుస్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదమ్ ఆరోపించారు. 

‘‘ ఠాక్రే సీఎంగా ఉన్న స‌మ‌యంలో అత‌డి (మెమన్‌) స‌మాధిని పుణ్య‌క్షేత్రంగా మార్చారు. ఇది వారికి ముంబై పట్ల ఉన్న దేశభక్తి, ప్రేమ. ఠాక్రే, శరద్ పవార్, రాహుల్ గాంధీ ముంబై ప్రజలకు క్షమాపణ చెప్పాలి ’’ అని ఆయన డిమాండ్ చేశారు. సేన అధికార ప్రతినిధి మనీషా కయాండే బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. మెమన్‌ను ఉరితీసినప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంద‌ని, సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఉన్నార‌ని చెప్పారు. 

‘‘ మెమన్ మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించడానికి ఆయ‌న (ఫ‌డ్న‌వీస్) ఎందుకు అనుమతించాడు? ఉగ్రవాద దోషులు లేదా ఇతర భయంకరమైన నేరస్థుల మృత దేహాలను ఎలా ఎదుర్కోవాలో ఒక విధానాన్ని రూపొందించుకుండా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏది అడ్డుకుంది. ’’ అని ఆయన ప్రశ్నించారు. 

లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లాను.. జార్ఖండ్ సీఎం సోదరుడి కామెంట్.. మండిపడుతున్న విపక్షాలు

ఇదే అంశంపై కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి అతుల్ లోంధే మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఇద్దరు భీకర ఉగ్రవాదులను ఉరితీశారని అన్నారు. అయితే భవిష్యత్తులో వారి సమాధులు రూపొందించకుండా ఉండేందుకు  మృతదేహాలను రహస్యంగా పారవేసారని చెప్పారు. 2013 ఫిబ్రవరిలో అఫ్జల్ గురును న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీయగా, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు.

‘‘ అప్పుడు (మెమన్  ఉరితీత సమయంలో) అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగా మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబీకులకు మృత‌దేహాన్ని అందించింది. వారి ఉద్దేశ్యం మత విభజన సృష్టించడం. అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను చంపినప్పుడు కూడా అతడి మృతదేహాన్ని సముద్రంలో పడవేసారు ’’ అని లోంధే గుర్తు చేశారు.

ర‌ష్యా చమురు.. ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యంపై నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌శంస‌లు

కాగా.. చంద్రశేఖర్ బవాన్‌కులే, ఆశిష్ షెలార్, కిరీట్ సోమయ్య వంటి పలువురు ఇత‌ర బీజేపీ నాయ‌కులు అలాగే ఆదిత్య థాకరే, అంబాదాస్ దాన్వే, కిషోరి పెడ్నేకర్ వంటి సేన నాయకులు కూడా ఈ స‌మాధిపై అలంక‌ర‌ణ అంశంపై కామెంట్లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios