విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరారు. 

కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ మద్దతు కోరుతోంది. ఈ నేపథ్యంలో విభేదాలను పక్కనపెట్టి కలిసి ముందుకు సాగాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్ గాంధీకి సూచించారు.
‘‘ఆర్డినెన్స్ వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చని చెప్పారు. విభేదాలను మరిచి కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని శుక్రవారం జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు’’ అని ఆప్ వర్గాలు తెలిపినట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది.

ఆర్మీపైనే తిరగబడ్డ మణిపూర్ వాసులు.. 1200 మంది గుంపు చుట్టుముట్టడంతో 12 మంది మిలిటెంట్లను విడుదల చేసిన సైన్యం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విపక్షాల తదుపరి సమావేశానికి హాజరుకావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ నెల 10 లేదా 12వ తేదీన సిమ్లాలో జరిగే తదుపరి సమావేశంలో విపక్షాలు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. అయితే వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయనందున ఆ పార్టీతో పొత్తు చాలా కష్టమని ఆప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మళ్లీ రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 కోచ్ లు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

‘‘ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన అంశంలో టీమ్ ప్లేయర్ గా వ్యవహరించడానికి కాంగ్రెస్ సంకోచించడం, నిరాకరించడం వల్ల ఆ పార్టీతో ఉన్న ఏ కూటమిలోనైనా ఆప్ భాగస్వామ్యం కావడం చాలా కష్టమవుతుంది. నల్ల ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ బహిరంగంగా ఖండించాలి. రాజ్యసభలో తమ 31 మంది ఎంపీలతో ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తామని ప్రకటించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పాల్గొనే భావసారూప్య పార్టీల భవిష్యత్తు సమావేశాలలో పాల్గొనడం ఆప్ కు కష్టం’’ అని సమావేశం ముగిసిన వెంటనే ఆప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఈజిప్టు ప్రధాని, కేబినేట్ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ.. వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ..

పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో నల్ల ఆర్డినెన్స్ ను బహిరంగంగా ఖండించాలని పలు పార్టీలు కాంగ్రెస్ ను కోరాయని, అయితే ఆ పార్టీ అందుకు నిరాకరించడం దాని అసలు ఉద్దేశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నదని ఆప్ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చించే ప్రక్రియ ఉందని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారని ఆప్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలా వద్దా అనే అంశంపై పార్లమెంటు సమావేశాలకు ముందే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు.