ఒడిశా రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోక ముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో కోచ్ లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఓ లోకో పైలట్ కు గాయాలు అయ్యాయి. 

పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓండా స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు లోకో పైలట్ కు గాయాలు అయ్యాయి.

ఈజిప్టు ప్రధాని, కేబినేట్ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ.. వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ..

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో ఈ ప్రమాదం జరిగింది. ఓండా స్టేషన్‌ మీదుగా గూడ్స్‌ రైలు వెళ్తుండగా వెనుక నుంచి మరో గూడ్స్‌ రైలు ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు ‘ఆజ్ తక్’ నివేదించింది. ఈ ఘటనలో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తర్వాత ట్రాక్‌లపై కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రైలు ఢీకొన్న సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Scroll to load tweet…

ప్రమాదానికి కారణమేంటి ? 
ఈ ప్రమాదానికి కారణమేంటి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గూడ్స్ రైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాక్ లను క్లియర్ చేయడానికి, రైళ్ల సేవలను పునరుద్దరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.