ఎన్డీయేను వీడిన వారందరిని శిక్షించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్న ఆయన ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. పాట్నాలో జరిగిన సమావేశానికి హాజరైన నాయకులపై ఆరోపణలు చేశారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను వీడిన నేతలను శిక్షించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్ లోని లఖిసరాయ్ లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. పాట్నాలో జూన్ 23వ తేదీన జరిగిన సమావేశానికి హాజరైన ప్రతిపక్ష నేతలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఛీ.. వీళ్లు అసలు తల్లిదండ్రులేనా ? రూ. 40 వేల కోసం.. 27 ఏళ్ల వ్యక్తికి 12 ఏళ్ల కూతురి విక్రయం
‘‘తొమ్మిదేళ్లలో కేంద్రం ఏం చేసిందని నితీశ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. కనీసం మీరు ఎవరితో కూర్చున్నారో, ఎవరి వల్ల ముఖ్యమంత్రి అయ్యారో వారిపట్ల కొంతైనా గౌరవం చూపండి. ఈ తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని అమిత్ షా అన్నారు. ‘‘ఈ తొమ్మిదేళ్లు భారతదేశ కీర్తికి ప్రతీకగా నిలిచాయి. ప్రధాని మోడీ ఈ కాలంలో చాలా దేశాలకు వెళ్లారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు పర్యటించారు. ఎక్కడికి వెళ్లిన ‘మోడీ, మోడీ’ అనే నినాదాలు వినబడుతున్నాయి.’’ అని తెలిపారు.
‘‘ ఇటీవల ఆయన (మోడీ) అమెరికా వెళ్లారు. కొందరు దేశాధినేతలు అపాయింట్ మెంట్ కోరారు. మరికొందరు ఆటోగ్రాఫ్ కోరారు. మరికొందరు ఆశీస్సుల కోసం ఆయన పాదాలను తాకారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీ పట్ల ఉన్న గౌరవం ఆయనది లేదా బీజేపీది మాత్రమే కాదు. కోట్లాది మంది భారతీయులది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు.
యజమాని ఇంట్లోకి పోనివ్వకుండా చిరుతను భయపెట్టిన శునకం.. తోక ముడిచి పరుగులు పెట్టిన పులి..వీడియో వైరల్
కాగా.. అంతకు ముందు అమిత్ షాకు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తో పాటు సీనియర్ నేతలు స్వాగతం పలికారు. ఇటీవల పాట్నాలో సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం తరువాత అమిత్ షా తొలిసారిగా బీహార్ లో పర్యటిస్తున్నారు. దాదాపు మూడు నెలల కిందట ఆయన చివరి సారిగా ఈ రాష్ట్రంలో పర్యటించారు.
అయితే ఈ ర్యాలీకి ముందు అమిత్ షా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అశోక్ ధామ్ లో ప్రార్థనలు చేశారు. కేంద్ర హోం మంత్రి పర్యటన దృష్ట్యా ముంగేర్ లోక్ సభ నియోజకవర్గంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఏరియల్ నిఘా కోసం కూడా డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి పర్యటన నేపథ్యంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అందరూ స్వేచ్ఛగా ఇక్కడికి రావచ్చు. బీహార్ ను సందర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
